రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములు, అసైన్ భూములను లాక్కొని వెంచర్లకు అమ్మేస్తుందని ఆరోపించారు మాజీ పీసీసీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖానాపూర్, కొకాపేటలో భూములు అమ్మేసిందఇ, కేసీఆర్ ప్రతి ఒక్కరికి భూమి, డబుల్ బెడ్ రూమ్, ఇళ్ల స్థలం ఉన్నవారికి డబ్బులు అన్నాడు.. మోసం చేసాడని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా… ప్రైవేట్ సర్వే వారిని అక్కడికి పంపించారని, అక్కడ ప్రభుత్వ సర్వే చేయాలన్నారు. ఇందిరా గాంధీ హయాంలో ఇచ్చిన భూములు ఆన్లైన్ లో ప్రభుత్వం విక్రయిస్తుందని హనుమంతరావు ధ్వజమెత్తారు.
ధరణి ధనవంతులకే ఉపయోగపడుతుందని ఆయన మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ ల ప్రభుత్వం భూస్వాములకు, కార్పొరేట్లకు ఉపయోగపడుతుంది.. పేదలను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరకి 100 కోట్లు అమ్మే పరిస్థితి వచ్చింది.. కోట్లలో విల్లాలు అమ్ముకుంటున్నారు మ్. భవిష్యత్ లో ఫుట్ పాత్ మీద పడుకునే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. దళిత బంధు లో 3 లక్షలు తీసుకుంటున్నారని, సోనియా గాంధి సభ తరువాత 19,20 తేదీలో అన్ని పార్టీ లను పిలుస్త..దళిత బంధు ఎవరికీ ఇచ్చారో అడుగుతా, పేదల భూములు వారికీ ఇచ్చే వరకు పోరాడుతా అని వీహెచ్ వ్యాఖ్యానించారు. పేద వాడికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కాంగ్రెస్ ఉంటుందని ఆయన అన్నారు.