Leading News Portal in Telugu

Devil : వైరల్ అవుతున్న సంయుక్త మీనన్ లుక్..


సంయుక్త మీనన్..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారింది ఈ భామ. సంయుక్త మీనన్‌. గతేడాది విడుదల అయిన భీమ్లానాయక్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన విరూపాక్ష సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ సినిమాతో ఈ అమ్మడుని టాలీవుడ్‌ గోల్డెన్‌ లెగ్‌ అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు.ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో డెవిల్‌ సినిమా ఒకటి.కళ్యాణ్ రామ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నవీన్‌ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి సంయుక్త మీనన్‌ బర్త్డే సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

చేతిలో కొబ్బరి కాయ, పూలమాలతో ఉన్న బుట్టను పట్టుకుని దేవుడికి పూజా చేయడానికి వెళ్తున్న సంయుక్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. పోస్టర్‌లో సంయుక్త తెలుగు తనం ఉట్టి పడేలా ఎంతో అందంగా కనిపిస్తుంది. చుట్టు గోపురాలు, గంట, తెల్లటి పావురాలు.. ఇలా పోస్టర్‌ మంచి పాజిటీవ్‌ వైబ్‌ను క్రియేట్‌ చేస్తుంది. ఈ సినిమాలో సంయుక్త నిషాద అనే పాత్రలో కనిపించనుంది. పీరియాడిక్‌ బ్యాక్‌గ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ బ్రిటీష్ వారికీ సీక్రెట్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.బ్రిటీషర్ల కోసం కళ్యాణ్‌రామ్ ఎందుకు పని చేశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ లుక్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా వుంది.ఈ సినిమాను అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్‌ 24న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ పెయిర్ డెవిల్ సినిమాతో ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.