Leading News Portal in Telugu

Talaivar 171: రజనీ విత్ లోకేష్..ఇది కదా మాస్ మరణ కాంబో


Talaivar 171: సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. ఇటీవలే జైలర్ సినిమాతో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు తలైవా రజినీకాంత్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన  విషయం తెలిసిందే. ఇక సూపర్ స్టార్ తదుపరి చిత్రానికి సంబంధించి పెద్ద అనౌన్స్ మెంట్ వచ్చేసింది. డైరెక్టర్ కనగరాజ్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం ఉండబోతున్నట్లు సినిమాను తెరకెక్కిస్తున్న సన్ పిక్చర్స్ ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం తలైవర్ 171 గా పిలుస్తున్న ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతానికి లోకేష్ విజయ్ తో లియో సినిమా చేస్తున్నారు.ఇక ఈ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిచనున్నట్లు కూడా అఫిషీయల్ గా ప్రకటించారు. జైలర్ సినిమాకు కూడా అనిరుద్ అదిరిపోయే మ్యూజిక్ ను అందించారు.

ఇక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గతంలో  ఖైదీ, విక్రమ్, మాస్టర్ వంటి  సూపర్ హిట్ సినిమాలు చేశాడు.ముఖ్యంగా విక్రమ్ సినిమాతో అయితే కమల్ హాసన్ కి మరిచిపోలేని కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ తో లియో సినిమా చేస్తున్నాడు. ఒకపక్క విక్రం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేష్ మరోపక్క జైలర్ లాంటి బ్లాక్బస్టర్ ఇచ్చిన రజిని కలిసి సినిమా చేస్తున్నారు అనే ప్రకటన రాగానే ఇది కదా మాకు కావాల్సిన మాస్ మరణ కాంబో అని తమిళ సినీ అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రజినీ కాంత్ తదుపరి సినిమా కూడా దుమ్ములేపడం పక్కా అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆ పోస్ట్ ను విపరీతంగా రీపోస్ట్ చేస్తూ కామెంట్ల రూపంలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.