Leading News Portal in Telugu

ఆర్థిక వ్యవస్థ పై బాబు అరెస్ట్ ప్రభావం! | babu arrest effect on economy| investers| industries| nation| wide| g20| summit


posted on Sep 12, 2023 2:39PM

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాష్ట్ర, రాజకీయాలను, రాజకీయ సమీకరణలను ప్రభావితం చేస్తుంది. అందులో సందేహం లేదు. అయితే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాజకీయలను మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తుందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.నిజానికి, చంద్రబాబు నాయుడు అరెస్ట్, రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తుంది అనేది ఇప్పటికే కళ్ళ ముందు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్’కు నిరసనగా తెలుగు దేశం పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రజలు స్వచ్చందంగా స్పందించిన తీరు గమనిస్తే, చంద్రబాబు నాయుడు అరెస్ట్’ను ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతుంది.

జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ప్రజలను చీదరించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు చివరకు సాధారణ కార్యకర్తలను సైతం గృహ నిర్బంధంలో కట్టి పడేసినా, రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినా, ప్రజలు స్వచ్చందంగా బంద్’ ను సక్సెస్ చేశారంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ రాష్ట్ర రాజకీయాలపై, రేపటి ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేరే చెప్పనక్కర లేదు. 

చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి ప్రతిపక్ష నాయకుడే కావచ్చును, కానీ, దెస విదేశాల్లో ఇప్పటికే ఆయన సంస్కరణలకు, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్’గా గుర్తింపు, గౌరం పొందారు.   ఆవిధంగా ఆయనకు,జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న  గుర్తింపు, గౌరవం గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఒక్క రాజకీయ రంగంమనే కాదు,అన్ని రంగాల ప్రముఖులు అనేక మంది చంద్రబాబు నాయుడు, అంటే ఒక విజనరీ, ఒక విశ్వాసం అని పేర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అన్నిటినీ మించి నాలుగు పదులకు పైగా ప్రజా జీవితంలో ఉన్న ఆయన సంపాదించుకున్న, విస్వసనీయత ఇంతా కాదు. ఆ విజనరీ దృక్పధం, ఆ విశ్వసనీయతల ఆధారంగానే, చంద్రబాబు నాయుడు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్’ నగరాన్ని, విశ్వనగరంగా, ఐటీ హబ్’ గా అభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాటిన ఐటీ విత్తనాలే ఈరోజు మహా వృక్షాలుగా ఎదిగాయి. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఐటీ హబ్’ నిలబెడుతున్నాయి.  

రాష్ట్ర విభజన తర్వాత,  నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా అనేక సవాళ్ళను ఎదుర్కుంటూ కూడా చంద్రబాబు నాయుడు, తమ అనుభవం, విజ్ఞత, వివేచన.. ఈ అన్నిటినీ మించిన విస్వసనీయతలను కలగలిపి, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించారు. కియా వంటి అనేక మేజర్ కంపెనీలు కొత్త రాష్ట్రం, అని చూడకుండా, చంద్రబాబు ఎక్కడుంటే అభివృద్ధి అక్కడ ఉంటుందన్నవిశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చాయి. అయితే, దురదృష్ట వశాత్తు 2019 ఎన్నికల్లో అధికారం చేతులు మరి, అరాచక శక్తుల చేతుల్లోకి పోవడంతో, పెట్టుబడులకు బ్రేకులు పడ్డాయి. దీంతో, ప్రస్తుత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే, అప్పులు, తిప్పలు, ఆర్థిక అరాచకం తప్ప మరో మాట వినిపించని పరిస్తితిలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే అద్వాన్న స్థితికి చేరింది. ఒక విధంగా చెప్పాలంటే, జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి పెట్టు బడులు కాదు, కనీసం అప్పులు కుడా పుట్టని పరిస్థితి నెలకొంది, అంటే, పరిస్థితి ఏమిటో వేరే వివరించవలసిన అవసరం లేదు. .

ఇప్పడు దీనికి తోడు జగన్ రెడ్డి ప్రభుత్వం, కక్షపూరితంగా విస్వసనీయతకు మారు పేరుగా నిలిచిన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం, అక్రమ నిర్భందంలో ఉంచడంతో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆ ప్రభావం ప్రబలంగా ఉంటుందని, ఆర్థిక నిపుణులు అంటున్నారు.