Leading News Portal in Telugu

Black hole: సూర్యుడి లాంటి నక్షత్రాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తినేస్తున్న బ్లాక్ హోల్..


Black hole: బ్లాక్ హోల్స్.. విశ్వంలో ఎంతటి వస్తువైనా దీన్నుంచి తప్పించుకోవడం అసాధ్యం. సెకన్‌కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్లే కాంతి కూడా ఈ దట్టమైన బ్లాక్ హోల్స్ నుంచి తప్పించుకోలేదు. శాస్త్రవేత్తలు మనకు సమీపంలో ఉండే ఒక గెలాక్సీలో మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ ని గుర్తించారు. ఇది సూర్యుడి పరిమాణం ఉన్న ఓ నక్షత్రాన్ని కబలిస్తోంది. నక్షత్రం ఈ బ్లాక్ హోల్ కి దగ్గరగా వచ్చినప్పుడు ప్రతీసారి భూమి ద్రవ్యరాశి కంటే మూడు రెట్ల పదార్థాన్ని తినేస్తోంది. ‘రిపీటింగ్ పార్షియల్ టైడల్ డిస్ట్రప్షన్’ అని పిలిచే ఈ పరిణామం బ్లాక్ హోల్ కి బ్రేక్‌ఫాస్ట్ గా ఉంటుంది.

బ్లాక్ హోల్స్ సాంద్రత, గురుత్వాకర్షణ శక్తి నక్షత్రాలతో పోలిస్తే కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. తాజాగా కనుగొన్న ఈ కృష్ణబిలం సౌరవ్యవస్థ నుంచి 520 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఒక కాంతి సంవత్సరం అంటే సెకన్ కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి ఏడాదికి ఎంతదూరం ప్రయాణిస్తుందో అంత దూరం అన్నమాట. ఏడాదిలో కాంతి 9.5 ట్రిలియన్ కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ఈ బ్లాక్ హోల్ చిన్నదని. అంచనా ప్రకారం సూర్యుడి కన్నా వందల వేట రెట్లు పెద్దది. కొన్ని గెలాక్సీల్లో మాసీవ్ బ్లాక్ హోల్స్ ఉంటాయి. ఇవి సూర్యుడితో పోలిస్తే కొన్ని వేల మిలియన్ల పెద్దగా ఉంటాయి. మన మిల్కీవే గెలాక్సీ మధ్యలో సజ్జరేటియస్-ఏ అనే అతిపెద్ద బ్లాక్ హోల్ ఉంది. మన సూర్యుడితో పోలిస్తే 4 మిలియన్ రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉంొది.

బ్లాక్ హోల్స్ ధాటికి గురయ్యే నక్షత్ర పదార్థం 3.6 మిలియన్ డిగ్రీల ఫారెన్ హీట్ (2 మిలియన్ డిగ్రీల సెల్సియస్) వరకు వేడెక్కుతుంది, భారీ మొత్తంలో ఎక్స్-కిరణాలను విడుదల చేస్తుంది. వీటిని నాసా కక్ష్యలో ఉన్న నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ గుర్తించింది. పరిశోధకుల్లో ఒకరైన ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ రాబ్ ఐల్స్-ఫెర్రిస్ మాట్లాడుతూ.. నక్షత్రం కక్ష్య క్రమంగా క్షీణిస్తోందని, నక్షత్రం పూర్తిగా నాశనం అవ్వడానికి కొన్ని ఏళ్లు పట్టొచ్చని అన్నారు.