Leading News Portal in Telugu

Etela Rajender : బీజేపీ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం ఇస్తుంది


బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కుమారుడు, బీఆర్‌ఎస్‌ నాయకులు అజ్మీరా ప్రహ్లాద్ బీజేపీలో చేరారు. ఆయనకు కాషాయ కండువా కప్పి ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, గరికపాటి మోహన్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అన్నీ వర్గాల ప్రజలకు సముచిత స్థానం ఇస్తుందన్నారు. కేంద్రంలో ఉన్న 75 మంది మంత్రుల్లో 27 మంది మంత్రులు బీసీలు ఉన్నారని ఆయన అన్నారు. కేవలం బీజేపీలోనే ఇది సాధ్యం అయ్యిందమైందని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. 12 మంది ఎస్సీ లు, 8 మంది ట్రైబల్ మినిస్టర్స్ ఉన్నారని, ఆదివాసీ మహిళకు అత్యున్నత స్థానం రాష్ట్రపతి పదవి ఇచ్చింది కూడా బీజేపీనే అని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి రాష్ట్రపతి ఎస్సీనీ చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనని ఆయన కొనియాడారు.

ప్రహ్లాద్ తో పాటు వెళ్తరెమో అని ములుగులో రెండు రోజులుగా ఇళ్లకు తాళాలు వేసి బెదిరిస్తున్నారట అంటూ ఈటల మండిపడ్డారు. నీ అబ్బ జాగీరా? పెన్షన్ డబ్బులు మావి తప్ప నీ ఇంట్లో నుండి ఇవ్వడం లేదని, పెన్షన్ తీసేసే దమ్ము ఏ పార్టీకి లేదన్నారు. మా పైసల మీద మీ పెత్తనం ఎంటి అని అడుగుతున్నామన్నారు ఈటల రాజేందర్‌. ఊపాసం ఉండి.. చదువుకున్న వారికి కాదు.. డబ్బులు ఇచ్చిన వారికే ఉద్యోగాలు అంటూ పేపర్లు లీకు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది అని ఆయన ధ్వజమెత్తారు.

అంతేకాకుండా..’హుజూరాబాద్ ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చింది. కేసీఆర్ డబ్బు సంచులకు, మందు సీసాలు లొంగలేదు. రేపు తెలంగాణ అంతా కూడా ఇదే రిపీట్ కాబోతుంది. ములుగు నియోజకవర్గంలో ఎగిరేది కాషాయ జెండా. ప్రహ్లాద్ గారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము.’ అని ఈటల వ్యాఖ్యానించారు.