బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం వనస్థలిపురం ఓ ఫంక్షన్ హల్ల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కోలార్ ఎంపీ మునుస్వామి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ , జాతీయ కార్యదర్శి యస్కుమర్ , రాష్ట్ర ఎస్సి మోర్చా అధ్యక్షుడు కొప్పు భాష ,మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు వస్తాయని వెల్లడించారు. చైతన్యాన్ని రగిలించండి ఐక్యంగా ఉండండి మనకు ప్రజల ఆశీర్వాదం ఉంటుందన్నారు ఈటల రాజేందర్. హుజురాబాద్ లో ఆత్మగౌరవం ఎలా నిలబెట్టారో తెలంగాణ అంతా నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. చరిత్రత్మక సన్నివేశంలో మనం ఉన్నాం దీన్ని జారవిడుచుకోవద్దని, అటుకులు బుక్కీ పార్టీ ని నడిపినాను అంటారు కదా ..900 కోట్లు పార్టీ అకౌంట్ లోకి వైట్ మని ఎలా వచ్చిందో కెసిఆర్ సమాధానం చెప్పాలన్నారు ఈటల రాజేందర్.
2014 సంవత్సరంలో పది లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని అన్నారు 2,91 లక్షల ఇండ్లు మంజూరు చేసి 1,30 లక్షల ఇండ్లు కట్టారు 35వేలు మాత్రమే పంచిండు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ 3కోట్ల 50 లక్షలు ఇల్లు కట్టించి ఇచ్చిండు.. కేంద్ర నిధులతో 20 లక్షల పక్క ఇళ్లు రాష్ట్రంలో కట్టారు.. కానీ ఇక్కడ మాత్రం తీసుకోలేదు.. పేదరికం జ్ఞానానికి అడ్డంకి కాదు.. కేసీఆర్ మాటలతో కాలం గడుపుతున్నాడు బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబం తప్ప మరొకరికి సీఎం పదవి రాదు కులాలతో అంతస్తులతో సంబంధం లేకుండా అధికారం అందించే పార్టీ బీజేపీ. కేసీఆర్ మాటలు వింటే 50 ఏళ్ల ముందు పుట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది కానీ మాటలు కడుపు నింపవు చేతలు కడుపులు నింపుతాయి.
అర్ధరాత్రి పూట నొప్పి లేస్తే మందు దొరకదు.. కానీ కుతిలేస్తే మద్యం సీసా దొరుకుతుంది. అన్నిట్లో నెంబర్ వన్ అని కేసీఆర్ చెప్తాడు దేంట్లో నెంబర్ వన్.. తాగుడు ఆదాయంలో నెంబర్ వన్. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడంలో అణగారిన వర్గాలకు అధికారం లేకుండా బానిసలు చేయడంలో కౌలు రైతుల ఆత్మహత్యలు చేసుకోవడంలో కేసీఆర్ నెంబర్ వన్. కేసీఆర్ దళిత జాతి మీద ఉన్న ప్రేమతో హుజురాబాద్ లో దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇవ్వలేదు వారి 47 వేలకు ఓట్ల మీద ఉన్న ప్రేమతో ఇచ్చారు.. కానీ హుజురాబాద్ ప్రజలు దాన్ని తిప్పి కొట్టారు ఒక లక్ష 70 వేల జీతం తీసుకునే ఉద్యోగికి కూడా హుజురాబాద్ లో 10 లక్షల రూపాయల ఇచ్చారు ఇవ్వండి .., కానీ తెలంగాణలో ఉన్న పేద దళితులకు ఇచ్చాక ఇవ్వండి. నియోజకవర్గానికి ఒక వెయ్యి మందికి కూడా 10 లక్షలు ఇవ్వకుండా దళిత జాతికి ద్రోహం చేసిన వ్యక్తి కెసిఆర్ మరి ఎలా ఆయనకు ఓటు వేద్దాం. తాత జాగీరు అన్నట్లు పేద దళితులకు కాకుండా బీఆర్ఎస్ నాయకులకు దళిత బంధు ఇచ్చుకుంటున్నాడు.
మద్యం ద్వారా తెలంగాణ వచ్చినప్పుడు పదివేల 700 కోట్ల ఆదాయం ఉంటే ఇప్పుడు 45 వేల కోట్లకు చేరిందని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని దళితులను మోసం చేసిన వ్యక్తి కెసిఆర్ కెసిఆర్ మన ఊర్లోకి వచ్చే నైతిక ఎక్కడిది. ఎమ్మెల్యే పదవి కొనుక్కుంటే అడుక్కుంటే వచ్చేది కాదు రాజ్యాంగబద్ధంగా ప్రజల ఓటుతో వచ్చేది గుడిసెల్లో ఉన్నవారికి అయినా లక్షల కోట్లు ఉన్నవారికి అయిన ఒక్క ఓటు మాత్రమే అందించారు అంబేద్కర్. మేనిఫెస్టో చూసి ఓటు వేశాం మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిలువరిచే అధికారం మాకు ఇచ్చారు కదా అంబేద్కర్..’ అని ఈటల రాజేందర్ అన్నారు.