షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం వనస్థలిపురం ఓ ఫంక్షన్ హల్ల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కోలార్ ఎంపీ మునుస్వామి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ , జాతీయ కార్యదర్శి యస్కుమర్ , రాష్ట్ర ఎస్సి మోర్చా అధ్యక్షుడు కొప్పు భాష ,మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు… ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ స్ఫూర్తి తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఎలా వ్యవహరిస్తుందో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కొరకు తెలంగాణ లో ఉన్న సకల జనులు కళాకారులు కవులు పోరాటం చేశారు.. వంటావార్పు సకలజనుల సమ్మె మిలియన్ మార్చ్ ఎన్నో కార్యక్రమాలు జరిగాయి…తెలంగాణ వేస్తే తొలి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ మోట్ట మొదట మోసం చేసినది దళితులనే… దళితుడైతే సమగ్ర వంతంగా పనిచేయారని చెప్పి తానే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కేసీఆర్ … మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మరోసారి దళితులను మోసం చేశారు… ఎస్సి సబ్ ప్లాన్ జాడ లేదు… దళిత బంధు పేరుతో సబ్ ప్లాన్ ను బంద్ చేశారు…100 సంవత్సరాలు అయిన దళిత బంధు పూర్తి స్థాయిలో రాదు… వివక్ష గురైన సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నాడు…వేలాది బ్యాక్ లాగ్ పోస్ట్ లు భర్తీ చేయకుండా అన్యాయం చేస్తున్నాడు.. ఫీజ్ రియంబర్స్ మెంట్ తో వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు… ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూలి పనులు చేస్తున్నారు… డబల్ బెడ్ రూమ్ లు అని చెప్పి మోసం చేశారు… డబల్ బెడ్ రూమ్ పేరుతో రాష్ట్రంలో మొసానికి గురైన సామాజిక వర్గం దళితులు.. రాజ్యాంగంను మారుస్తా అని చెప్పి బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమాణిస్తున్నాడు.. దళిత బంధు డబల్ బెడ్ రూమ్ లు మొదటగా దళితులకు రావాలి… కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యక ఎస్సి కార్పొరేషన్ మూతపడ్డది.. నరేంద్రమోదీ పంపిస్తున్న కేంద్ర నిధులను కేసీఆర్ దారి మల్లిస్తూన్నాడు…
కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే స్కాలర్ షిప్ లను అడ్డుకుంటున్న వ్యక్తి కేసీఆర్.. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది… రైతు బంధు భూస్వాములకు కట్టబెడుతునాన్రు… కౌలు రైతుకు మొండి చేయి చుపిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం… మోడీ ప్రభుత్వం బడుగుబాలహీన ప్రభుత్వం.. చాయ్ అమ్మిన వ్యక్తి భారత దేశ ప్రధాని అయ్యాడు కావున బలహీన వర్గాల బ్రతుకులు తెలుసు కాబట్టి నీతివంతమైన పాలన అందిస్తున్నాడు.. ఒక్క రోజు హాలిడే తీసుకోకుండా పనిచేస్తూన్న వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ… దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్ నాధ్ కొవింద్ ద్రౌపతి ముర్మ్ కు రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపి ప్రభుత్వం ది.. ప్రతిఒక్కరు సమగ్ర వంతంగా పని చేయాలి…
కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ ఎస్ కు ఓటు వేసినట్టే ,బీఆర్ ఎస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ కు ఓటు వేసినట్టే ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే… రాష్ట్రంలో కాంగ్రెస్ టిడిపి టిఆర్ ఏస్ బీఆర్ ఎస్ కు అవకాశం కల్పించారు..ఒక్కసారి బీజేపీ కి అవకాశం ఇవ్వాలి.. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంభంగా మారింది… రాష్ట్రం ఆప్పుల పాలయింది..ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది… మళ్ళీ బీఆర్ ఎస్ వస్తే సంక్షేమ పథకాలు జరగవు.. నిరుద్యోగ దీక్ష 13 14 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద 24 గంటల దీక్షల చేయబోతున్నాం దీనికి ప్రతిఒక్కరికి రావాలి… 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవం ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది…దీనికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలి… 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ టీడీపీ బీఆర్ ఎస్ ప్రభుత్వాలు విమోచన దినోత్సవం ను నిర్వహించలేదు.. రజాకార్ల చేత అణిచివేయబడ్డ చరిత్ర తెలంగాణ ప్రజలది..’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.