Leading News Portal in Telugu

Kodali Nani and Vangaveeti Radha: కొడాలి నాని, పార్థ సారథి, వంగవీటి రాధాకు అరెస్ట్‌ వారెంట్..


Kodali Nani and Vangaveeti Radha: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ బస్టాండ్‌ ఎదుట ధర్నా చేశారు నేతలు.. అయితే, దీనిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు.. అదే కేసులో ఈ రోజు విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యే కోర్టు అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసింది.. వైసీపీ నేతలు కొడాలి నాని, పార్థ సారథి, అడపా శేషులతో పాటు ప్రస్తుంత తెలుగుదేశం పార్టీలో ఉన్న వంగవీటి రాధాకు కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.. కాగా, కొడాలి నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్ ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్‌లో ఉంది. వాయిదాలకు కొడాలి నాని రాకపోవడంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, పోలీసు ఉత్తర్వులు ఉల్లంఘించి 2016 మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కొడాలి నాని, మరికొందరు నాయకులు ర్యాలీ చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే కారణంగా కేసు నమోదైంది. ఈ కేసులో కొడాలి నాని కోర్టుకు హాజరుకాక పోవడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది.