పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు గురించి కుర్రాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అందాల ఆటంబాంబ్.. ఆరెక్స్ 100 సినిమాతో పరిచయమైనా ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మొత్తం చూపించేసింది..తెరపైనే అలా రెచ్చిపోయిందంటే.. సోషల్ మీడియాలో ఇంకెలా రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాయల్ చేసే అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. తాజాగా బికినీలో తన సొగసులు చూపించినట్టే చూపించి.. చివరకు ఉసూరుమనిపించింది.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
అయితే పాయల్ కెరీర్ డల్ అయ్యింది. మరలా పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు తమిళ భాషల్లో చిత్రాలు చేస్తుంది. పాయల్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ మంగళవారం. ఆర్ఎక్స్ 100 వంటి భారీ హిట్ ఇచ్చిన అజయ్ భూపతి ఈ చిత్ర దర్శకుడు కావడం విశేషం.. మంగళవారంతో పాయల్ కమ్ బ్యాక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే తమిళంలో రెండు చిత్రాలు చేస్తుంది.. గత ఏడాది పాయల్ నటించిన తీస్ మార్ ఖాన్ విడుదలైంది. ఆది హీరోగా నటించిన ఈ మూవీలో పాయల్ రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ మూవీ కూడా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. కంటెంట్ పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా ఆడలేదు. అలాగే మంచు విష్ణుకు జంటగా జిన్నా చిత్రం చేసింది.. ఆ మూవీ కూడా హిట్ అవ్వలేదు.. మొదటి సినిమా భారీ సక్సెస్ ను అందుకున్న కూడా ఈ అమ్మడు సరైన హిట్ పడలేదు దాంతో సోషల్ మీడియాలో అందాలతో యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. ఇక సౌరభ్ దింగ్రా అనే వ్యక్తిని ప్రేమిస్తున్న పాయల్… అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. ఏళ్లుగా వీరి రిలేషన్ సాగుతుంది. సౌరభ్ తో పాయల్ ప్రేమ బహిరంగ రహస్యమే.. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటుందో చూడాలి..