Leading News Portal in Telugu

Abhinav Gomatam: నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమెడియన్..


Abhinav Gomatam: ఈ నగరానికి ఏమైంది సినిమా చూసినవారికి అభినవ్ గోమఠం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే ఆ పేరు వినలేదా .. కౌశిక్ పేరు విన్నారా.. ? ఏ .. అతనా ఇతను అంటే అవును. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నాడు అభినవ్. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతున్న అభినవ్ ఈ మధ్యనే కల్పిక గణేష్ వివాదంలోకి లాగిన విషయం కూడా తెల్సిందే. తనను అసభ్యంగా కామెంట్స్ చేసారని, ఏంటి అని అడిగితే.. వాళ్ల ఫ్రెండ్స్ తో తనను బెదిరించాడని చెప్పుకొచ్చింది. వీరిద్దరి సోషల్ మీడియా వార్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం అభినవ్ పేరు ట్విటర్ లో మారుమ్రోగుతుంది. అందుకు కారణం.. ఒక నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం.

Amardeep: ఒక్క నామినేషన్ తో.. ఈ కుర్రాడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడే ..?

అసలు విషయమేంటంటే.. కోలీవుడ్ నటుడు, మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్.. హిందూ సనాతన ధర్మం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ విషయం విదితమే. ఇక ఆ వ్యాఖ్యలు హిందూ సంఘాలను ఫైర్ అయ్యేలా చేశాయి. తెలుగువారు సైతం ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఈ నేపథ్యంలోనే ఒక మీటింగ్ లో పవన్ కళ్యాణ్ హిందూ సనాతన ధర్మంను కాపాడడం మన ధర్మం అని చెప్పిన వీడియో వైరల్ గా మారింది. తాజాగా అభినవ్ ఆ వీడియోను షేర్ చేస్తూ.. ” థాంక్యూ పవన్ కళ్యాణ్ గారు.. “సెక్యులరిజం” ఎలా దుర్వినియోగం అవుతుందో చెప్పినందుకు.. సనాతన ధర్మం ఎంతో గొప్పది.. ఎప్పటినుంచో మనలో పాతుకుపోయింది.. ఎటువంటి రాజకీయ అనుబంధాలు లేకుండా దావా వేసే హక్కు పౌరుడిగా నాకు ఉంది” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ పై ఒక నెటిజన్ రిప్లై ఇస్తూ.. ” అన్నా.. బయో లో బీజేపీ కుక్క అని పెట్టుకో.. మాకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది” అని రాసుకొచ్చాడు. దానికి ఫైర్ అయిన అభినవ్ .. “నువ్వు కాంగ్రెస్ పందికొక్కు అని ముఖం మీద టాటూ వేయించుకో.. VPKA” అంటూ ఘాటు లాంగ్వేజ్ లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.