Leading News Portal in Telugu

Hyderabad: జహీరాబాద్‌లో విశాల్‌ షిండే హత్య కేసు.. నిందితుడు నజీర్‌ అహ్మద్‌ మృతి


Hyderabad: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్‌కు పాతబస్తీ అడ్డాగా మారింది. ఇక్కడ కత్తిపోట్లూ, గ్యాంగ్ వార్లూ సర్వసాధారణం. కొందరు మద్యం తాగి గొడవలకు దిగుతుండగా, మరికొందరు కక్షలతో కత్తులు, తల్వార్లతో దాడికి దిగుతున్నారు. అయితే పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో కాస్త ప్రశాంతంగా ఉంది. అయితే ఈ పాత బస్తీలో ఏం జరుగుతుంది..? ఏ సమయంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఊహించడం చాలా కష్టం. గత రాత్రి పాతబస్తీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నజీర్‌ అహ్మద్‌గా గుర్తించారు. రెండేళ్ల క్రితం జహీరాబాద్‌లో విశాల్‌ షిండే హత్య కేసులో నజీర్‌ అహ్మద్‌ నిందితుడు. విశాల్ షిండే హత్య కేసులో నసీర్ అహ్మద్ సహా 7 మంది సభ్యులు. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్‌లో నజీర్ అహ్మద్‌ను దుండగులు హత్య చేశారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read also: Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి షాక్‌.. వైసీపీ గూటికి కీలక నేత

ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్ గూడ శివాజీ నగర్ ప్రాంతానికి చెందిన విశాల్ షిండే(22) సెప్టెంబర్ 2020 -29న అదృశ్యమై హత్యకు గురైన విషయం తెలిసిందే.. కనిపించడం లేదంటూ అతని తల్లి కల్పన ఫిర్యాదు చేయడంతో 30న ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు 2020 అక్టోబర్ 1న జహీరాబాద్ అడవుల్లో విశాల్ షిండే హత్యకు గురైనట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు జహీరాబాద్ ప్రాంతానికి చేరుకుని విశాల్ షిండే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో నజీర్ (20), జహీర్ (19), మరికొందరు జహీరాబాద్ అడవుల్లో విశాల్‌ను హత్య చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
TSRTC: బస్సుల్లో క్యాష్‌లెస్ జర్నీ..! డిజిటల్ పేమెంట్ల ద్వారా టికెట్లు