భూం భూం.. ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ శిష్యుడు సెటైర్లు! | actor srinivas ayyangar satires on ap liquor| bhum| bhum| beer| drik| fear| what
posted on Sep 13, 2023 10:25AM
ఏపీలో మద్యం బ్రాండ్ల గురించి సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తుంటే.. జనబాహుల్యం అవేం బ్రాండ్లు, అదేం మద్యం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ధర ఎక్కువ.. నాణ్యత తక్కువ అన్న రీతిలో ఏపీలో మద్యం విధానం ఉందన్న విమర్శలు గత నాలుగేళ్లుగా వినవస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా అనిపించడం లేదు. అది పక్కన పెడితే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. వైసీపీ కండువా కప్పుకుని ఈ మధ్య కాలంలో సినిమాలు తీస్తున్నారు. జగన్ కు ఆయన సర్కార్ కు మద్దతుగా ఎప్పుడు పడితే అప్పడు మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జనసేనాని పవన్ కల్యాణ్ నడి రోడ్డుపై పడుకున్న సంఘటనపైనా తనదైన శైలిలో స్పందించారు. పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు. తన గమ్యం సినిమాలో సీన్ ను కాపీ కొటి ఆయన నడిరోడ్డుపై రక్తి కట్టించడానికి ప్రయత్నించారంటూ ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పించారు. అయితే తాజాగా ఏపీలో బీర్ తాగుతున్నా..ఏమౌతుందో.. ఏమౌతానో అంటూ టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు పొందిన శ్రీనివాస్ అయ్యంగార్, సోషల్ మీడియాలో తాను బీరు తాగుతున్న ఫొటో పెట్టి కామెంట్ చేశారు. ఇది వెంటనే వైరల్ అయ్యింది. అన్నిటికంటే మించి నటుడు శ్రీనివాస్ అయ్యంగార్ ఆర్టీవీకి అనుంగు శిష్యుడు. ఆర్జీవీ కాంపౌండ్ లోని మనిషి. అటువంటి ఆర్జీవీ శిష్యుడు జగన్ సర్కార్ మద్యం విధానంపైనా, ఏపీలో తయారౌతున్న బీరుపైనా ఈ రేంజ్ లో సెటైర్లు గుప్పించడం ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. ఔను తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్. విలక్షణ దర్శకుడు ఆర్జీవీ శిష్యుడు. గురువు ఏమో ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుంటే.. శిష్యుడేమో ఇన్ డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్ గా ఏమిటి డైరెక్ట్ గానేసెటైర్స్ వేస్తున్నారు. అసలు ఏపీ ప్రభుత్వంపై శ్రీకాంత్ అయ్యంగార్ ఏం మాట్లాడారు? అనే విషయాల్లోకి వెళితే, శ్రీకాంత్ అయ్యంగార్ పోస్ట్ చేసిన వీడియోలో.. తాను విజయవాడ వచ్చానని, ఏపీలో బీరు తాగుతున్నానని చెబుతూ.. ఆయన భూం భూం బీరుని చూపించారు. అక్కడితో ఆగకుండా.. ఇంట్లో చెప్పలేదని, ఇది తాగిన తరువాత ఏమవుతుందో ఏమోనని భయపడుతున్నానంటూ దాన్ని తాగారు. ఇప్పుడదే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దానిపై నెటిజన్స్ కూడా తమదైన శైలిలో కామెంట్స్ విసురుతున్నారు.
నెటిజన్స్ ఈ రేంజ్లో రియాక్ట్ కావటానికి కారణం.. ఏపీలో దొరికే మద్యం అక్కడే తయారవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కొందరైతే అక్కడి మద్యం తాగలేక బయట రాష్ట్రాలకు వెళ్లి అక్కడి మద్యం కొనుక్కుని తాగుతుంటారు. అక్కడ దొరికే బ్రాండ్స్‌పై నెటిజన్స్ ట్రోలింగ్స్ చేయటాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ భూం భూం బీరు తాగే వీడియోను పోస్ట్ చేయటంతో మరోసారి ట్రోలర్స్‌కి పని కల్పించినట్లయ్యింది. ఇంకా బతికే ఉన్నావా? ఆ బీరు తాగి త్వరగా హాస్పిటల్‌కి వెళ్లు అని ఒకరంటే.. తను సరదాగా చేసుంటారని సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదని కొందరంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మద్దతుదారులు మాత్రం శ్రీకాంత్ అయ్యంగార్‌పై విరుచుకుపడుతున్నారు.
అయితే కొందరు మాత్రం అసలు మందు తాగితే తాగు, లేదా తాగకపో.. కానీ దాన్ని వీడియోగా చేసి ఏదో భయపడి తాగుతున్నట్లు వీడియో ఎందుకు చేయటం దీని వల్ల లేని పోని సమస్యలు వస్తాయే తప్ప.. మరేమీ ఉండదని అంటున్నారు. ఏదేమైనా ఏపీ ప్రభుత్వం ఆర్జీవీ శిష్యుడు ఇలా వీడియో చేయటం అనేది వైరల్‌గా మారింది.