Libiya: లిబియాలో వరదలు విలయతాండవం చేస్తున్నాయి. సోమవారం నుండి కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరద తాకిడికి పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. ఈ ఘటనలో వేలమంది ప్రాణాలను కోల్పోయారు.అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. లిబియా నగరమైన డెర్నాలో 100,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. కాగా డేనియల్ తుఫాను కారణంగా సంభవించిన వరద మధ్యధరా తీర నగరమైన డెర్నాను అతలాకుతలం చేసింది. ఈ దుర్ఘటనలో 5,300 మందికి పైగా మరణించారు. వరద నీటి ఉదృతికి 10000 మందికి పైగా గల్లంతయ్యారు. 7000 క్షతగాత్రులయ్యారు. కాగా మరణాల సంఖ్య 10000 వేలకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న డెర్నా కు సమయం చేసేందుకు చాల దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు రెస్క్యూ బృందాలను డెర్నా పంపించారు. అత్యవసర సేవలను అందిస్తున్నారు. లిబియా సాంఘిక మాధ్యమాల ప్రకారం ఎక్కడ చూసిన మృత దేహాలు కుప్పలు తిప్పలుగా పది వున్నాయి.. దహన సంస్కారాలకు స్మశాన వాటికలో క్యూ లో ఉండాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది.. సోమవారం రోజే 300 కంటే ఎక్కువ మంది మృత దేహాలని ఖననం చేశారు.. ఇంకా ఖననం చేయాల్సిన మృత దేహాలు వందల్లో ఉన్నాయి. ఈ వరద దాటికి కార్లు, ఇల్లులు కనుమరుగయ్యాయి. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం జరిగిందని డెర్నా అధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం డెర్నా లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.