Leading News Portal in Telugu

Devil : మ్యూజికల్ అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్..


కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా వున్నారు.. కళ్యాణ్ రామ్ ప్రేక్షకులకు కొత్త తరహా కథలను చూపించాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు.. అలా ఆయన చేసిన ప్రమోగం ‘బింబిసార’.. ఈ సినిమా కళ్యాణ్‌ రామ్‌కు తిరుగులేని విజయం అందించింది.. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బింబిసారా మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌ జోష్‌తో ఇదే ఏడాది ఆరంభం లో ‘అమిగోస్‌’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కళ్యాణ్ రామ్.. అమిగోస్ మూవీ రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాకు భారీగా బజ్‌ ఏర్పడింది. కానీ కానీ రిలీజయ్యాక డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది.. అయితే ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ డెవిల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.’బాబు బాగా బిజీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నవీన్‌ మేడారం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్‌ చేశాయి.పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ బ్రిటీషర్‌లకు సీక్రెట్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు.రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదల అయినా టీజర్ ఎంతో ఆసక్తి రేకెత్తించింది. కళ్యాణ్ రామ్ లుక్స్ కూడా ఎంతో కొత్తగా వున్నాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా ఈ భామ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు మేకర్స్.ఆ పోస్టర్ లో సంయుక్త నిండైనా చీర లో అచ్చమైన తెలుగు అమ్మాయిలా మెరిసింది. ఈ సినిమాలో సంయుక్త పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని సమాచారం.అయితే తాజాగా మేకర్స్‌ ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్‌ అప్‌డేట్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు.. ఈ సినిమా మ్యూజిక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను గురువారం సాయంత్రం 4:05 నిమిషాలకు ప్రకటించబోతున్నట్లు తెలిపారు.ఇప్పటికే రిలీజైన టీజర్‌ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్‌ చేసింది. దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా డెవిల్‌ ముసుగేసుకుని బ్రిటీషర్ల కోసం కళ్యాణ్‌రామ్ ఎందుకు పని చేశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం.. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్‌ 24న ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.

https://twitter.com/AbhishekPicture/status/1701838645463044545?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1701838645463044545%7Ctwgr%5E16a6031e7a77aa849ce060ffbc6b00bc63470b62%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F