Pay By Car :ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపించాలి అనుకున్న.. లేదా డబ్బులు డ్రా చెయ్యాలి అనుకున్న కచ్చితంగా బ్యాంక్ కి వెళ్లాల్సి వచ్చేది. ఇక బ్యాంక్ సెలవు రోజుల్లో అయితే ఎంత అవసరం ఉన్న ఏం చెయ్యలేని పరిస్థితి ఉండేది. దీనిని అధిగమించడానికి ATM లు ఏర్పాటు చేశారు. దీనితో సెలవు దినాల లోను బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుని సులువుగా డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోనికి వచ్చింది. ఇక పెరిగిన సాంకేతికతతో ఆన్లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనితో ఫోన్ ద్వారానే చాలావరకు లావాదేవీలు జరుగుతున్నాయి. దీనితో ఎటిఎం కు వెళ్లాల్సిన పని కూడా తప్పింది.. కాగా తాజాగా ఆన్లైన్ చెల్లింపుల్లో సరికొత్త ఆవిష్కరణ అందుబాటులోకి రానుంది. “అదే కార్ బై పే”.
వివరాలలోకి వెళ్తే.. టోన్‌ట్యాగ్ అనే సంస్థ మాస్టర్ కార్డు, అమెజాన్ సాయంతో ‘పే బై కార్’ అనే కొత్త పేమెంట్ సిస్టమ్ ని ఆవిష్కరించింది. ఈ సిస్టమ్ “యూపీఐ” సహాయంతో పనిచేస్తుంది. ఇటీవలే ఎంజీ హెక్టార్, భారత్ పెట్రోలియంలు సంయుక్తంగా కలిసి ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. కారులో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ద్వారా సులువుగా ట్రాంసెక్షన్స్ చేయొచ్చు. కార్ పెట్రోల్ బంక్‌కు వెళ్ళినప్పుడు కార్ లో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ఆక్టివేట్ అయ్యి అనౌన్స్ మెంట్ ఇస్తుంది.
అలానే బంక్ సిబ్బంధికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అనంతరం పెట్రోల్ లేదా డీజిల్ ఎంత కావాలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సిబ్బధికి ఈ సమాచారాన్ని అందిస్తుంది. దీని ద్వారా సులువుగా ట్రాంసెక్షన్స్ చేసుకోవచ్చు. పేమెంట్ పూర్తి అయ్యాక అకౌంట్ లో ఉన్న బాలన్స్ కూడా స్క్రీన్ పైన కనబడుతుంది. అంతేకాదు ఈ దీని సహాయంతో ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు.