Leading News Portal in Telugu

Jawan: వంద కోట్లు ఇచ్చాం… ఇంకెన్ని మా ఆస్థి కూడా రాసిచ్చేయమంటా?


కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ కంబ్యాక్ ని మర్చిపోక ముందే జవాన్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసే పనిలో ఉన్నాడు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ ఇప్పటివరకూ చూడని వసూళ్ల సునామీని చూపిస్తున్న షారుఖ్ ఖాన్… వర్కింగ్ డే, హాలీడే అనే తేడా లేకుండా బాక్సాఫీస్ ర్యాంపేజ్ సృష్టిస్తున్నాడు. వారం తిరగకుండానే జవాన్ సినిమా 600 కోట్లని రాబట్టి ఈ వీకెండ్ కి 1000 కోట్ల మార్క్ ని రీచ్ అవనుంది. పదేళ్లుగా ఒక్క హిట్ లేని హీరో ఈ రేంజ్ కంబ్యాక్ ఇవ్వడం అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదే మొదటిసారి. జవాన్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుంటే బాలీవుడ్ మీడియాలోని ఒక వర్గం మేధావులు మాత్రం సౌత్ ఆడియన్స్ ని విమర్శించే పనిలో ఉన్నారు.

నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలని ఆదరించారు కానీ సౌత్ ఆడియన్స్ నార్త్ సినిమాలని అంతగా ఆదరించట్లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జవాన్ సినిమా కేవలం సౌత్ లోనే వంద కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది, ఇందులో మేజర్ కాంట్రిబ్యూషన్ తెలుగు-తమిళ్ నుంచే ఉన్నాయి. ఒక స్ట్రెయిట్ హిందీ సినిమా సౌత్ లో వంద కోట్లు రాబట్టడం అనేది ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ ఏ నార్త్ సినిమాకు కూడా సౌత్ ఈ ఆదరణ లభించలేదు. షారుఖ్ తో పాటు అట్లీ, నయన్, అనిరుద్ కూడా ఉన్నారు కాబట్టే జవాన్ సినిమాకి సౌత్ లో అంత బజ్ జనరేట్ అయ్యింది లేదంటే జవాన్ సినిమాకి సౌత్ లో అన్ని కలెక్షన్స్ కూడా వచ్చేవి కాదు. ఈ విషయం అర్ధం చేసుకోని బాలీవుడ్ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తే బాగుంటుంది.