టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సినిమాల లో 7/G బృందావన్ కాలనీ సినిమా కూడా ఒకటి. 2004 లో విడుదలైన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా అయితే కాదు.ఆ రోజుల్లో ఈ మూవీకి యూత్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు.. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది.. ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్స్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం లో ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరో గా నటించాడు. ఇందులో రవి కృష్ణ సరసన సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని తెలుగుతోపాటు తమిళంలో నూ విడుదల చేయగా రెండు ఇండస్ట్రీ లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఎంతగానో పాపులర్ అని చెప్పొచ్చు..
తాజాగా ఈ మూవీ రీరిలీజ్ కు సిద్ధం అయింది.తాజాగా ఈ సినిమా రీరిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీని సెప్టెంబరు 22 న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను సెప్టెంబరు 16న రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ మరోసారి థియేటర్ల లో సందడి చేయబోతున్న నేపథ్యం లో యూత్ మరోసారి ఈ సినిమా కోసం తెగ ఎదురుచూస్తున్నారు.త్వరలోనే ఈ మూవీ సీక్వెల్ ను కూడా తెరకెక్కించబోతున్నట్లు డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఇటీవల ప్రకటించారు.ఈ సినిమాలో కూడా హీరో గా రవికృష్ణ నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్ లో హీరోయిన్ ఎవరనేది మాత్రం తెలియాల్సి వుంది..అయితే ఈ సీక్వెల్ మూవీ కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.