Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. అయితే, ములాఖత్‌లో చంద్రబాబును కలిసేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.. ఇప్పటికే నారా ఫ్యామిలీ చంద్రబాబును కలిసింది.. 40 నిమిషాల పాటు చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణి భేటీ అయ్యారు.. మరోవైపు.. ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయవాది, ప్రస్తుతం చంద్రబాబు కేసును వాదిస్తోన్న సిద్ధార్థ్ లూథ్రా కూడా ములాఖత్‌లో చంద్రబాను కలిశారు.. ఈ కేసు విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై చర్చించారు.. ఇక, రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ కలబోతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ముందుగా రేపు చంద్రబాబును పవన్ కల్యాణ్ కలుస్తారని తెలసింది.. ఆ తర్వాత చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైలులో పవన్ ములాఖత్ కి సంబంధించి ఇప్పటివరకు తమకు ఎటువంటి దరఖాస్తులు రాలేదని జైలు సూపరిండెండెంట్ పేర్కొన్నారు.. ఇక, ములాఖత్ కు జైలు అధికారులు పర్మిషన్ ఇస్తే నిబంధనల ప్రకారం పవన్ కల్యాణ్ రావొచ్చని పోలీసులు తెలిపారు.. దీంతో.. పవన్ కల్యాణ్ రేపు రాజమండ్రి వస్తున్నారా? లేదా? అనే చర్చ సాగుతూ వచ్చింది. అయితే, రాత్రి 7 గంటల తర్వాత కాస్త క్లారిటీ వచ్చింది.. సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును రేపు ములాఖత్‌లో పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ కలుస్తారని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే ఓసారి జైలులో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులతో వెళ్లి పరామర్శించారు లోకేష్.. అయితే, గురువారం రోజు పవన్, బాలయ్య, లోకేష్ ఒకేసారి వెళ్లి చంద్రబాబును కలుస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.