Keerthy Suresh:మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టింది. అందులో రివాల్వర్ రాణి ఒకటి కాగా మరో రెండు సినిమాలు అమ్మడు చేతిలో ఉన్నాయి. ఇక ఇందులో జవాన్ డైరెక్టర్ అట్లీ తదుపరి సినిమా ఒకటి అని టాక్. జవాన్ తో భారీ విజయాన్ని అందుకున్న అట్లీ .. తన తదుపరి సినిమాను కూడా బాలీవుడ్ హీరోతోనే తీయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుణ్ ధావన్ తో ఒక సినిమా చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. సినిమాల విషయం పక్కనపెడితే.. మొదటి నుంచి కూడా అట్లీ, అతని భార్య ప్రియా.. కీర్తి సురేష్ మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెల్సిందే. ప్రియా కూడా ఒక నటి. పలు సినిమాల్లో ఆమె సపోర్టింగ్ రోల్స్ చేసి మెప్పించింది.
Sai Pallavi: లేడీ పవర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ.. సూపర్ స్టార్ వారసుడితో.. ?
ఇక కీర్తి సురేష్ కొద్దిగా సమయం దొరికిన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. తాజాగా కీర్తి.. అట్లీ ఇంట్లో సందడి చేసింది. జవాన్ సినిమాలోని చలోనా సాంగ్ కు అట్లీ భార్య ప్రియాతో కలిసి కీర్తి డాన్స్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చలోనా సాంగ్ కి ప్రియా, కీర్తి ఎంతో అద్భుతంగా డాన్స్ చేశారు. ఒక పక్క వీరు డాన్స్ చేస్తుంటే వెనుక నుంచి అట్లీ నవ్వుతూ రావడం కనిపిస్తుంది. దీంతో అట్లీ తర్వాత సినిమాలో కీర్తి హీరోయిన్ గా కన్ఫర్మ్ అని తెలుస్తుంది. ఇకపోతే జవాన్ తరువాత నాలుగు నెలలు గ్యాప్ తీసుకున్న అట్లీ.. ఆ తరువాత బాలీవుడ్ సినిమాను ప్రకటిస్తాడా.. ? లేక టాలీవుడ్ హీరోతో సినిమా అంటాడా.. ? అనేది చూడాలి.