Leading News Portal in Telugu

Sai Pallavi: లేడీ పవర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ.. సూపర్ స్టార్ వారసుడితో.. ?



Sai

Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన భామ సాయిపల్లవి. ఈ సినిమా తరువాత.. తన సినిమాల ఎంపికతో, వ్యక్తిత్వంతో ముద్దుగుమ్మ అందరిని ఫిదా చేసి లేడీ పవర్ స్టార్ అనే బిరుదును అందుకుంది. ఇక గత కొన్ని రోజులుగా ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక దీంతో సాయిపల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పిందని వార్తలు వచ్చాయి. కొంతమంది ఆమె పెళ్లి చేసుకుంటుందని, ఇంకొంతమంది డాక్టర్ గా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇక అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. పాత్ర నచ్చకపోతే.. అది ఎలాంటి సినిమా అయినా కూడా ఆమె రిజెక్ట్ చేస్తుంది. భోళా శంకర్, చంద్రముఖి 2 సినిమాలను కూడా ఆమె రిజెక్ట్ చేయడమే అందుకు నిదర్శనం. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న చిత్రంలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు.

Ustaad Bhagat Singh: పవన్ సినిమాలో కమల్ మాజీ భార్య.. ?

ఇక తాజాగా సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ లో హిట్ అందుకున్న లవ్ టుడే సినిమాను బాలీవుడ్ లో జునైద్ రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తరువాత జునైద్ మరో కొత్త మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఆ మూవీకి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జునైద్ సరసన సాయిపల్లవి అయితే బావుంటుందని మేకర్స్ భావించి ఆమెను సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమాకు సాయిపల్లవి ఓకే చెప్పిందా.. ? లేదా.? అనేది తెలియాల్సి ఉంది. ఇక అభిమానులు అయితే.. బాలీవుడ్ కు సాయిపల్లవి నో నే చెప్తుంది అని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.