AP CM Jagan Tour: రేపు(శుక్రవారం) విజయనగరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. విజయనగరం మెడికల్ కాలేజ్ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను (విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల) ఆయన వర్చువల్గా ప్రారంభించనున్నారు.
శుక్రవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రాంగణానికి చేరుకుంటారు, అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ, తర్వాత నూతన మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం, ల్యాబ్ల పరిశీలన, మిగిలిన 4 మెడికల్ కాలేజీల వర్చువల్ ప్రారంభోత్సవం, అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.