రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ లవ్ స్టోరీ ఇటీవలే ఆడియన్స్ ముందుకి వచ్చింది. సూపర్బ్ మ్యూజికల్ ఫీల్ ఇచ్చిన ఖుషి సినిమా థియేటర్స్ లో మొదటి రోజు మార్నింగ్ షోకే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ బాగుండడంతో విజయ్ దేవరకొండ హిట్ కొట్టేసాడని ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. సెకండ్ డేకి ఖుషి టాక్ మిక్స్డ్ గా మారింది. టాక్ లో మార్పు వచ్చినా కూడా కలెక్షన్స్ లో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యే టైమ్ కి ఖుషి సినిమా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ కి రీచ్ అయ్యింది. మొదటి మండే నుంచి ఖుషి మూవీ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. యుఎస్ఏ లో 1.2 బ్రేక్ ఈవెన్ మార్క్ కాగా 1.8 మిలియన్ రాబట్టిన ఖుషి సినిమా, ఓవర్సీస్ లో ప్రాఫిటబుల్ సినిమాగా నిలిచింది.
ఆస్ట్రేలియా, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ… ఇలా అన్ని సెంటర్స్ లో ఖుషి సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ముఖ్యంగా తమిళనాడులో 10 కోట్ల గ్రాస్ ని రాబట్టి ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చింది. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ అయ్యింది కదా, మంచి ప్రాఫిట్స్ మిగిలింది మరి సినిమాని ఎందుకు లాస్ వెంచర్ అంటున్నారు అంటే… ఖుషి సినిమా భారీ నష్టాలని మిగిలించింది ఆంధ్రప్రదేశ్ రీజన్ లో. ఈ ఏరియాలో ఖుషి సినిమా దాదాపు పది కోట్ల డిఫిసిట్ లో ఉంది. ఏపీలోని అన్ని ఏరియాల్లో ఖుషి బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ కాలేదు. అక్కడ పది కోట్ల లాస్ వచ్చింది కాబట్టే ఖుషి సినిమా ఫ్లాప్ లిస్టులో పడింది కానీ ఏపీలో కాస్త నష్టాలు తగ్గి ఉంటే ఖుషి మూవీ హిట్ స్టేటస్ అందుకునేదేమో.