Leading News Portal in Telugu

Srinu Vaitla: దర్శకుడి ఇంట్లో విషాదం… మా లక్ష్మీ చనిపోయింది అంటూ ఎమోషనల్ ట్వీట్


తెలుగు మూవీ లవర్స్ కి వెంకీ, ఢీ లాంటి కల్ట్ కామెడీ సినిమాలని గిఫ్ట్ గా ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండి పోయే దూకుడు లాంటి సినిమాని ఇచ్చిన శ్రీను వైట్ల, గత కొంతకాలంగా ఫ్లాప్ స్ట్రీక్ లో ఉన్నాడు. కెరీర్ కష్టాల్లో పాడేసుకున్న శ్రీను వైట్ల ఇంట్లో విషాదం జరిగింది. తాను మొదటిసారిగా ఇంటికి తెచ్చుకున్న ఆవు చనిపోయింది. 13 ఏళ్లుగా తన ఫార్మ్ లోనే ఉన్న ఆవు చనిపోవడంతో సోషల్ మీడియాలో శ్రీను వైట్ల ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు. ‘లక్ష్మీ’ అని శ్రీను వైట్ల కూతుర్లు ప్రేమగా పిలుచుకునే ఆవుకి సాంప్రదాయంగా అంత్యక్రియలు చేయనున్నారు. ‘లక్ష్మీ’ ఫోటోని పోస్ట్ చేసి శ్రీను వైట్ల ఈ విషయాన్ని తెలియజేసాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే శ్రీను వైట్ల ప్రస్తుతం మ్యాచో హీరో గోపీచంద్ తో ఒక మూవీ చేస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెగ్యులర్ షూటింగ్ జరిగి, ఈ మూవీ బయటకి వచ్చి అటు శ్రీను వైట్లకి, ఇటు గోపీచంద్ కి ఇద్దరికీ మంచి హిట్ ఇస్తుందేమో చూడాలి. గోపీచంద్ కూడా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. శ్రీను వైట్లతో చేస్తున్న సినిమా హిట్ అవ్వకపోతే గోపీచంద్ మార్కెట్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. సో ఏ సినిమా హిట్ అవ్వడం శ్రీను వైట్ల-గోపీచంద్ లకి ఎంతో ఇంపార్టెంట్.