Leading News Portal in Telugu

Telangana: విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా జ్వరాలు.. పదుల సంఖ్యలో మరణాలు


Telangana: తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకు జర్వాలు పెరుగుతుండటంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో జిల్లా, మండల, గ్రామ వ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. జర్వాలతో ఆసుపత్రులు నిండుతున్నాయి. ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 నుండి 150 ఓపి వస్తున్నాయి. మండల కేంద్రంలోని ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోను తక్కగపోవడంతో 120 కిలోమీటర్ల దూరంలో వున్న జిల్లాలోని ఎంజీఎం, ప్రైవేటు ఆసుపత్రిలో చేరి జేబులు ఖాళీ చేసుకున్న ప్రాణాలు కాపాడులేకపోతున్నరని కన్నీరుమున్నీరవుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

ములుగు జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన ఎటురునాగారం కన్నాయిగూడెం, మంగపేట, తాడువాయి,వాజేడు, వెంకటాపురం మండలాల్లో డెంగ్యూ, మలేరియా పాజిటివ్ కేసులో జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. డెంగ్యూ మలేరియా జ్వరాలతో ఊరు ఊరు మొత్తం బిక్కు బిక్కు మంటు రోజు గడుపుతున్నారు. గ్రామాల్లోని ప్రజలు ఏ చిన్న జ్వరం వచ్చిన గ్రామాల్లోని ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి పరిగెత్తుతున్నారు. అక్కడ రెండు రోజులు మందులు వాడగానే స్థానిక ప్రభుత్వ,ప్రయివేటు హాస్పటల్ టెస్టులు చేసుకోక రిపోర్టులో డేంగు, మలేరియా పాసిటివ్ వస్తున్నాయి. ఎంతకీ జ్వరాలు తగ్గకపవడంతో అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని పెద్ద ఆసుపత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఈ విష జ్వరాలా భారిన పడి ఇప్పటికే 15 రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో ప్రాణాలు వదిలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇక మరోవైపు నిజమాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రెండు నెలల వ్యవధిలో 120కి పైగా డెంగ్యూ కేసుల నమోదయ్యాయి. డెంగ్యూ జ్వరంతో.. చికిత్స పొందుతూ ఇంధల్ వాయి మండలం తిర్మన్ పల్లికి చెందిన బీటెక్ స్టూడెంట్ భరత్ మృతి చెందాడు. డెంగ్యూతో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందడంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏటూరు నాగారం ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఒక స్టాఫ్ నర్స్ మాట్లాడుతూ.. తాడ్వాయి మండలం రంగాపూర్ కు చెందిన రంగారావు అనే రైతు మృత్యువాత పడ్డారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన దివ్య అనే గృహిణి డెంగ్యూ జ్వరం పెరగడంతో జిల్లా కేంద్రంలోని ఎంజిఎంకి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. మంగపేట మండలం ఓడగుడెం లోని ఎస్సి కాలని కి చెందిన రామక్క అనే వృద్ధురాలు ప్రవేట్ హాస్పిటల్లో చూపించుకున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఎంజిఎం తరలించారు. అక్కడ కూడా తగ్గకపోవడంతో, ఎంజిఎం చికిత్స పొందుతూ మృతి చెందింది. నిన్న కన్నయిగుడెమ్ మండలం బుట్టయిగుడెంలోని హేమలత అనే యువతి ప్రవేటు దవాఖానలో చికిశ్చ పొందుతూ మృతి చెందగా. అదే గ్రామానికి చెందిన అరు నెల్లు నిండని పాప జ్వరం తో ఇంటి వద్ద మృతి చెందిందని తెలిపారు.

ఇలా జ్వరలతో చనిపోవడంతో కుటుంబాల్లో విషాదఛాయలు అమ్ముకున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న జ్వరలు దృష్టిలో ఉంచుకొని వైద్య అధికారులు కలెక్టర్ వెంటనే స్పందించి హెల్త్ క్యాంపులు పెట్టీ, ఏజెన్సీ గుడలలోని బ్లీచింగ్ పౌడరు చల్లడం లాంటి చేస్తూ, డ్రైనేజీ ఉరుగు కాలువలు క్లీన్ చేస్తూ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని ఏజన్సీ ప్రాంతం ప్రజలు అధికారులను కోరుతున్నారు. జిల్లా వైద్యాధికారి అప్పయ్య మాట్లాడుతూ ములుగు జిల్లాలో రోజురోజుకు జరపీడుతులు పెరుగుతున్నారని అన్నారు. ఈ జ్వరం వచ్చినా అది డెంగ్యూ కాదని భయపడాల్సిన పనిలేదని, మందులు వాడుతూ రెస్ట్ తీసుకోవాలని కోరారు. ఇంటి పరిశుభ్రంగా చేసుకోవాలని దోమలు ఎక్కువగా ఉన్నా నేపథ్యం లో దోమతెరలు వాడాలని కోరారు. జిల్లాలో ఇప్పటికే 11 డెంగు కేసులు, 26 మలేరియా కేసులు నమోదు అయ్యాయ్యాని కొందరు చనిపోవడం జరిగిందని తెలిపారు.
Indian student’s death: తెలుగు యువతి మృతిపై దర్యాప్తు చేయాలి.. అమెరికాను కోరిన ఇండియా..