Leading News Portal in Telugu

Assam CM Wife Scam : ముఖ్యమంత్రి భార్యకు రూ.10 కోట్ల సబ్సిడీ.. ఆన్ లైన్ లో ఆధారాలు


Assam CM Wife Scam : అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రూ.10 కోట్ల సబ్సిడీ పొందిందన్న వార్త ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. బీజేపీ నేతలకు, వారి అనుచరులకు  కేంద్ర ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు  కనకవర్షం కురిపిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

‘పీఎం కిసాన్‌ సంపద యోజన’ పథకం కింద అందిన సబ్సిడీతో సీఎం భార్య్ కూడిన రినికి భూయాన్‌ శర్మకు చెందిన కంపెనీకి రూ.10 కోట్లు అందాయి. రినికి చెందిన ప్రైడ్‌ ఈస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ నిధులు అందినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ఆహార శాఖ వెబ్‌సైట్‌లోనే దీనికి సంబంధించిన సమాచారం ఉంది అంటూ అందుకు సంబంధించిన స్ర్కీన్ షార్ట్ లను ఎక్స్ లో పంచుకున్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్​ గొగొయ్. ‘పీఎం కిసాన్‌ సంపద యోజన’ పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా చైన్‌లో ఆధునిక మౌలిక వసతులను కల్పించడం.  ఇందుకోసం సబ్సిడీతో కూడిన రుణాల్ని కేంద్ర ఆహార ప్రాసెసింగ్‌ శాఖ లబ్దిదారులకు అందిస్తుంది.

అయితే తన భార్య కంపెనీ రూ.10 కోట్ల సబ్సిడీ పొందిందన్న వార్తను సీఎం హిమంత బిశ్వ శర్మ ఖండించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు.  అయితే ఆన్ లైన్ లో ఉంచిన పత్రాల గురించి మాత్రం ఆయన ఏం మాట్లాడలేదు.  కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రిత్వశాఖ 2022 నవంబర్‌ 10న  సీఎం భార్యకు సంబంధించిన  కంపెనీకి రూ.10 కోట్ల సబ్సిడీ ఇవ్వడానికి అంగీకరించింది ఓ వెబ్ సైట్ పేర్కొంది. హిమంత బిశ్వ శర్మ సీఎం అయిన 9 నెలలకే ఆయన భార్య ఆ కంపెనీలో మెజారిటీ వాటా పొందరని కూడా ఆ వెబ్ సైట్ పేర్కొంది. ఇక అస్సాం రాజకీయాల్లో ఈ రగడ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.