HONOR 90 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘హానర్’ గురించి టెక్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘హువావే’ అనుబంధ సంస్థగా ఉన్న హానర్ బ్రాండ్‌పై ఎన్నో స్మార్ట్‌ఫోన్‌లు గతంలో విడుదల అయ్యాయి. అయితే దాదాపు మూడేళ్లుగా హానర్ నుంచి ఒక్క స్మార్ట్‌ఫోన్ కూడా భారత మార్కెట్‌లో లాంచ్ కాలేదు. హానర్ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తోంది. నేడు ‘హానర్ 90 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను భారత దేశంలో లాంచ్ చేస్తోంది. 200 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్లో విడుదల అవుతోంది.
HONOR 90 5G Launch:
హానర్ 90 5జీ స్మార్ట్‌ఫోన్ గురువారం (సెప్టెంబర్ 14) భారత మార్కెట్‌లో విడుదల కానుంది. హానర్ 90 5జీ లాంచ్‌కు సంబంధించి నేడు ఈవెంట్ జరగనుంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. హానర్ 90 5జీ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్లు బయటకొచ్చాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత మేజిక్ ఓఎస్ 7.1తో వస్తోంది.
HONOR 90 5G Camera:
హానర్ 90 5జీ స్మార్ట్‌ఫోన్ 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ అమర్చబడింది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇందులో ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేటుతో ఈ ఫోన్ వస్తోంది. ఇది 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.
HONOR 90 5G Battery:
హానర్ 90 5జీ స్మార్ట్‌ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో వస్తున్నట్లు తెలిసింది. 16GB RAM మరియు గరిష్టంగా 512GB స్టోరేజ్ నిల్వతో రానుంది. 12GB + 256GB బేస్ వేరియంట్ CNY 2,499 (దాదాపు రూ. 29,000) ధరతో మేలో చైనాలో లాంచ్ అయింది. 16GB + 256GB మరియు 16GB + 512GB వేరియంట్‌ల ధరలు వరుసగా CNY 2,799 (సుమారు రూ. 32,680), CNY 2,999 (సుమారు రూ. 35,017)గా ఉన్నాయి. భారత దేశంలో కూడా దాదాపుగా ఇవే ధరలు ఉండనున్నాయి.