TOllywood Producer Gogineni Prasad Passed Away: ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం స్టార్ హీరో మమ్ముట్టి సోదరి అనారోగ్యం కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సైతం సినిమాలు నిర్మించిన బాలీవుడ్ నిర్మాత ముఖేష్ ఉదేషి కన్నుమూశారు. ఇక పరిశ్రమ ఆ రెండు షాకింగ్ న్యూస్ ల నుండి ఇంకా కోలుకోకుండానే మరో నిర్మాత కన్నుమూసినట్టు వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలు నిర్మించిన ఒకప్పటి ప్రముఖ నిర్మాత గోగినేని ప్రసాద్ అనారోగ్యంతో కన్నుమూశారు. నిర్మాత గోగినేని ప్రసాద్ ఈ చరిత్ర ఏ సిరాతో, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం”, నందమూరి బాలకృష్ణతో “పల్నాటి పులి” వంటి సినిమాలు నిర్మించారు.
Delhi : బాణాసంచాపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం..
అయితే వయోభారం రీత్యా గత కొంత కాలంగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయన వయసు 73 సంవత్సరాలు కాగా హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న తన నివాసంలో నిన్న సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాక కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వారు తెలిపారు. గోగినేని ప్రసాద్ కు ఒక కుమారుడు ఉండగా ఆయన అమెరికాలో స్థిరపడినట్టు తెలుస్తోంది. ఇక ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నామని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇక గోగినేని ప్రసాద్ మృతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.