Leading News Portal in Telugu

Delhi: భవన నిర్మాణ కార్మికులకు శుభవార్త చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం


Delhi: ఢిల్లీ ప్రభుత్వం భవన కార్మికుల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో మొబైల్ వ్యాన్‌లను ఉపయోగించి ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలోని లేబర్ సైట్ లలో పనిచేస్తున్న భవన కార్మికుల పేర్లను నమోదు చేస్తున్నారు. దీనిద్వారా వీలైనంత ఎక్కువమంది కార్మికుల్ని గుర్తించే అవకాశం వుంది. ఎవరి పేర్లు అయితే నమోదు చేయబడతాయో ఆ కార్మికులు వివిధ సంక్షేమ పథకాల కింద ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇప్పటికే కార్మికుల్ని గుర్తించి నమోదు చేయడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ సందర్భంగా ఢిల్లీ కార్మిక మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ మాట్లాడుతూ.. ఢిల్లీ భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ త్వరలో ప్రారంభం కానుంది.“ఈ నెలాఖరులో దీన్ని ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించబడింది.

“ఈ నేపథ్యంలో మొబైల్ రిజిస్ట్రేషన్ వ్యాన్‌లను ప్రారంభించాము. దీని ద్వారా అన్ని సంక్షేమ పథకాలకు అవసరమైన పత్రాలను వీలైనంత ఎక్కువ మంది కార్మికులకు అందించగలుగుతాము . కార్మికులకు వారి నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మరియు వారికి కొత్త ఉపాధి మార్గాలను అందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.” అని ఢిల్లీ కార్మిక మంత్రి రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. వార్తా పత్రికల ద్వారా కార్మికులకు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. అలానే ఇప్పటి వరకు డిల్లీ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన రిజిస్ట్రేషన్, క్లెయిమ్‌లు మరియు అప్‌డేట్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విషయాలపైన మంత్రి స్పందించారు. వీలైనంత త్వరగా వాటిని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.