Leading News Portal in Telugu

iPhone 15 Price: ఐఫోన్ 15 కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చిన యాపిల్!


iPhone 14 Pro Exchange Value is Rs 67800: కాలిఫోర్నియా వేదికగా ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లను యాపిల్‌ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మొత్తం నాలుగు ఫోన్లను యాపిల్‌ తీసుకొచ్చింది. ఐఫోన్ 15 ప్రీ-ఆర్డర్ బుకింగ్స్‌ శుక్రవారం నుంచి మొదలు కానుండగా.. ఈ నెల చివరి వారంలో అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ లవర్స్ 15 సిరీస్ ప్రీ-ఆర్డర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఓల్డ్ ఐఫోన్ ఎక్స్‌ఛేంజ్‌ చేసి.. ఐఫోన్ 15 కొనాలనుకునే వారికి యాపిల్ కంపెనీ షాక్ ఇస్తోంది.

ఐఫోన్ 15 ప్రో ఫోన్ 128GB బేస్ మోడల్ ధర రూ. 1,34,900గా యాపిల్‌ కంపెనీ నిర్ణయించింది. ఈ బేస్ మోడల్ ఫోన్ కొనేందుకు పాత ఐఫోన్ 14 ప్రోను ఎక్స్‌ఛేంజ్‌ చేయాలనుకుంటే.. రూ. 64,500 తగ్గింపును యాపిల్ అందిస్తోంది. ఈ ఎక్స్‌ఛేంజ్‌ ధరను ఐఫోన్ 14 ప్రో 1TB వేరియంట్‌పై అందిస్తోంది. ఐఫోన్ 14 ప్రో 1TB వేరియంట్ ధర రూ. 1,79,900గా ఉంది. అంటే యాపిల్ అందిస్తున్న ఈ ఆఫర్ ఐఫోన్ 14 ప్రో అసలు ధర కంటే రూ.1,15,400 తక్కువ. అసలు ధరలో సగం కంటే తక్కువ ధరనే యాపిల్ అందిస్తోంది.

కొత్త ఐఫోన్ అయినా, మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉన్నా.. యాపిల్ కంపెనీ గరిష్టంగా ఎక్స్‌ఛేంజ్‌ వాల్యూ రూ. 70 వేలకు (67,800) మించి ఉండదట. 1TB స్టోరేజ్‌తో టాప్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ ఎక్స్ఛేంజ్ చేసినప్పటికీ.. కేవలం రూ. 67,800 మాత్రమే పొందుతారు. గతేడాది ఐఫోన్ 14 కొనుగోలు చేసిన వారికి ఇది తీవ్ర నిరాశే అని చెప్పొచ్చు. ఇతర మోడళ్లకు ఎక్స్‌ఛేంజ్‌ వాల్యూ భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక భారతదేశంలో యాపిల్ అందించే ఎక్స్‌ఛేంజ్‌ వాల్యూ.. అమెరికాలో అందించే ఎక్స్‌ఛేంజ్‌ వాల్యూ కంటే చాలా తక్కువగా ఉందని టెక్ వర్గాలు పేర్కొన్నాయి.