Leading News Portal in Telugu

Jupalli Krishna Rao: సిద్దిపేట, సిరిసిల్లలో తప్ప మరెక్కడ డబుల్ బెడ్ రూములు ఇయ్యలేదు..


నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ఆయన పేర్కొన్నారు. అవినీతి జరుగకపోతే రాష్ట్రంలోని అన్ని స్కీములు పూర్తయ్యేవి.. మోటార్ పంపుల విషయంలో 800 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు జూపల్లి కృష్ణరావు ఆరోపించారు. తెలంగాణలో జరిగిన అవినీతి విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలి అని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాలు ఇస్తానని కేసీఆర్ ఇవ్వలేదు అని కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణరావు అన్నారు. 2 వేల నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి.. ఇప్పటి వరకు ఒక్క కుటుంబాన్ని కూడా ఉద్యోగం ఇవ్వలేదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్లలో తప్ప మరెక్కడ డబుల్ బెడ్ రూములు పంపిణీ చేయలేదు అని జూపల్లి విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు, కేసీఆర్ కి ప్రజలే తగిన బుద్ది చెబుతారని జూపల్లి కృష్ణరావు అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు అన్నారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్ బీజేపీతో రసహ్య ఒప్పందం చేసుకున్నాడు.. అందుకే ఒకరికి ఒకరు పరోక్షంగా సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నారని జూపల్లి కృష్ణరావు అన్నారు.