Leading News Portal in Telugu

MY3: ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దమైన హన్సిక ఫస్ట్ వెబ్ సిరీస్..


హన్సిక.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది హన్సిక. ఈ మూవీ  సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.దీంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది. తెలుగులో ఈ భామ రామ్ పోతినేని సరసన మస్కా అలాగే ప్రభాస్ తో బిల్లా, ఎన్టీఆర్ తో కంత్రివంటి సినిమాలలో నటించి మెప్పించింది.. అయితే అందం మరియు అభినయంతో ఆకట్టుకున్న కానీ హన్సిక తెలుగులో మాత్రం అనుకున్నంత స్టార్ డమ్ అందుకోలేకపోయింది. తెలుగుతోపాటు.. తమిళంలో కూడా అనేక చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ గతేడాది వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయినప్పటికీకూడా తన సినీ కెరీర్ ను కొనసాగిస్తోంది హన్సిక.

ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది హన్సిక ముఖ్య పాత్రలో నటించి MY3 అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది. మూగెన్ రావు హీరోగా నటిస్తోన్న ఈ సిరీస్ కు రాజేశ్ ఎం. దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రేపటి నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో హన్సికతోపాటు శంతను భాగ్యరాజ్, జనని అయ్యర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ కు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ బుధవారం విడుదల చేసారు. ఈ వెబ్ సిరీస్ లో మైత్రి అనే హ్యూమనాయిడ్ రోబోగా అలాగే మనిషిగా రెండు పాత్రలు పోషించింది హన్సిక. ఇందులో హన్సిక లుక్, మ్యానరిజం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ లలో స్ట్రీమింగ్ కానుంది.ఇప్పటివరకు హన్సిక ఇలాంటి పాత్రలో కనిపించలేదు.అన్నారు చిత్రయూనిట్. ఇటీవల విడుదలైన కొరియన్ వెబ్ సిరీస్ ఐయామ్ నాట్ ఏ రోబోట్ కు అధికారిక రీమేక్ గా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు