Kangana Ranaut:కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రెస్స్. రాజకీయాలు, సినిమాలు, ఇండస్ట్రీ దేని మీద అయినా కంగనా ఫైర్ అవ్వడమే. ఒక్కసారి ఆమె ఫైర్ అయిందంటే ఆమెను ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ ను ఎదిరించి నిలిచిన ఏకైక హీరోయిన్ అంటే కంగనా అని చెప్పాలి. ఇక సినిమాల విషయంలో కూడా ఆమె అంతే నిక్కచ్చిగా ఉంటుంది. విభిన్నమైన కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కంగనా ఎప్పుడు ముందే ఉంటుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే ఆమె నటించే చిత్రాలన్నీ కాంట్రవర్సీని తీసుకొచ్చి పెడతాయి అని చెప్పొచ్చు. ఇక ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా కంగనా నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2. పి. వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కంగనానే స్వయంగా వాసుకి ఫోన్ చేసి చంద్రముఖి పాత్ర తాను చేస్తానని చెప్పడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక దీంతో మేకర్స్ సైతం కంగనానే ఒప్పుకున్నాక వేరే వారిని అడగడం ఎందుకు అని ఆమెని ఫైనలైజ్ చేశారు.
Vijay: తండ్రికి గుండె ఆపరేషన్.. విదేశాల నుంచి వచ్చిన హీరో
చంద్రముఖి 2 పోస్టర్ రిలీజ్ రాగానే కంగనా లుక్ చూసి చంద్రముఖిగా నటించిందా..? జీవించిందా..? అని అభిమానులు చెప్పుకొచ్చారు. అంతలా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఈ సినిమా కోసం ఈ భామ భారీగానే రెమ్యూనిరేషన్ అందుకుందని సమాచారం. బాలీవుడ్ లో ప్రస్తుతం దీపిక మాత్రమే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. కోలీవుడ్ బ్యూటీ నయనతార దాదాపు రూ. 10 కోట్లు పైనే అందుకుంటుందని సమాచారం. వీరిద్దరిని దాటి కంగనా.. చంద్రముఖి 2 కోసం అక్షరాల రూ 22 కోట్లు అందుకుందని తెలుస్తుంది. మేకర్స్ సైతం స్వయంగా ఆమె అడిగింది కదా.. అని రెమ్యూనరేషన్ తగ్గించకుండా ఆమె మార్కెట్ ను బట్టి అంత మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తుంది. అయితే ఇంత ఇవ్వండి… అంత ఇవ్వండి.. అని కంగనా ఎప్పుడు అడిగింది లేదు. మేకర్స్ ఇంతిస్తాము అని చెప్పడం.. దానికి ఓకే అనడం తప్ప ఆమె ఏ రోజు పారితోషికం విషయంలో డిమాండ్ చేసింది లేదు అని తెలుస్తుంది. ఏది ఏమైనా ఒక్క సినిమాకు అక్షరాల రూ. 22 కోట్లు తీసుకున్న హీరోయిన్ గా కంగనా రికార్డు సృష్టించిందని చెప్పాలి. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియదు గానీ ఇది మాత్రం కేవలం కంగనా రేంజ్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా కంగనాకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.