Leading News Portal in Telugu

Uttarpradesh: జువెనైల్‌ హోమ్‌లో అమానుషం.. పిల్లలను చెప్పుతో కొట్టిన మహిళ అధికారి


Superintendent Brutally Trashes Girl In UP Juvenile Home: బాల ఖైదీలుగా హోమ్‌లోకి వచ్చిన పిల్లలకు మంచి బుద్దులు, సత్ప్రవర్దన అలవాటు చేయాల్సిన బాధ్యత జువెనైల్ హోమ్ అధికారులది. తెలిసి, తెలియక చేసిన నేరాలకు వారు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అయితే వారిని తీర్చిదిద్దాల్సిన అక్కడి సిబ్బంది కొన్నిసార్లు వారితో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చిన్నపిల్లలనే కనికరం లేకుండా కర్కశంగా కొడుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఓ మహిళా అధికారి తన బాధ్యతలు మరిచి చిన్నపిల్లలను చెప్పుతో కొట్టింది. ఈ ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆగ్రాలోని జువైనల్ హోంలో సీసీ టీవీలో కొన్ని దృశ్యాలు రికార్డయ్యారు. ఇవి సోమవారం నుంచి సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో అక్కడి చిన్నారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. ఈ వీడియోలుఅందరిని షాక్‌కి గురి చేస్తున్నాయి. సోమవారం, మంగళవారం రెండు వీడియోలు విడుదల కాగా అవి విస్మయానికి గురిచేస్తున్నాయి. సోమవారం విడుదల చేసిన వీడియోలో ఒక గదిలో మంచంపై పడుకొని ఆరుగురు బాలికలు ఉన్నారు. ఇంతలో సడెన్ గా అక్కడికి వచ్చిన  జువైనల్ హోం సూపరింటెండెంట్ పూనమ్ పాల్ కనికరం లేకుండా ఓ బాలికను చెప్పుతో ఎలా పడితే అలా కొట్టింది. అంతేకాకుండా ఇతర బాలికలను కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఇదంతా చూస్తున్న తోటి ఉద్యోగులు కూడా ఆమెను ఆపలేదు. ఇంకా మంగళవారం విడుదలైన వీడియోలో ఏడేళ్లు వయసు ఉన్న బాలికను మంచానికి కట్టేశారు. ఆమె విడుపించుకోవడానికి ప్రయత్నించిన వీలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేశాడు. దీంతో ఈ విషయంపై విచారణ జరిపిన అధికారులు పాల్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై కేసు నమోదు చేశారు.