Leading News Portal in Telugu

AP CM Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం జగన్‌


AP CM Jagan: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలను సీఎం ప్రారంభించారు. అనంతరం విజయనగరం వైద్య కళాశాలలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినీ, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు ఉన్నారు.

వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏపీ సర్కారు నిర్మించనుంది రూ. 8,480 కోట్ల వ్యయంతో మొత్తం17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోంది. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరుగనుంది. ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి.