Leading News Portal in Telugu

Sanjay Dutt: బాలీవుడ్ ఐకానిక్ క్యారెక్టర్ మున్నా భాయ్ మళ్లీ రాబోతున్నాడు…


బాలీవుడ్ లో ఐకానిక్ క్యారెక్టర్స్ అనే లిస్ట్ తీస్తే అందులో టాప్ ప్లేస్ లో ఉంటుంది ‘మున్నా భాయ్’ క్యారెక్టర్. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ‘మున్నా భాయ్ MBBS’ సినిమాతో మున్నాభాయ్ క్యారెక్టర్ ప్రయాణం మొదలయ్యింది. సంజయ్ దత్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. మున్నాభాయ్ కి హిందీలోనే కాదు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు, రీమేక్ అయిన అన్ని భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో చిరు ‘మున్నాభాయ్’ని ‘శంకర్ దాదా’గా మార్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాడు. కామెడీ, ఎమోషన్, మెసేజ్ అన్నీ కలిపి ఉండే మున్నాభాయ్ క్యారెక్టర్ ని సీక్వెల్ కూడా క్రియేట్ చేసిన రాజ్ కుమార్ హిరానీ… లగే రహో మున్నాభాయ్ అన్నాడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

మున్నాభాయ్ కి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు అర్షద్ వర్షి ప్లే చేసిన సర్క్యూట్ క్యారెక్టర్ కి కూడా కనెక్ట్ అవుతారు. సంజయ్ దత్-అర్షద్ వర్షి క్యారెక్టర్స్ మధ్య ఉండే సీన్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలాంటి ఐకానిక్ క్యారెక్టర్స్ మళ్లీ రాబోతున్నాయా అనే డిస్కషన్ సోషల్ మీడియాలో మొదలయ్యింది. రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో ‘డుంకీ’ అనే సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ లో రిలీజ్ టార్గెట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో సంజయ్ దత్, అర్షద్ కలిసి కనిపించారు. డుంకీ సెట్స్ లో మున్నాభాయ్-సర్క్యూట్ కలిసి కనిపించే సరికి రాజ్ కుమార్ హిరానీ ఎదో కొత్తగా ట్రై చేస్తున్నాడని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. ఇదే నిజమైతే సంజయ్ దత్ ని మున్నాభాయ్ గా మళ్లీ చూసే అవకాశం పాన్ ఇండియా ఆడియన్స్ కి దక్కుతుంది.