
Karnataka: కర్ణాటకలో ఫ్రెష్ గా మారో వివాదం రాజుకుంది. హుబ్బల్లిలోని వివాాదాస్పద ఈద్గా మైదనంలో గణేష్ విగ్రహానని ప్రతిష్టించడానికి అనుమతి కొరుతూ హిందూ కార్యకర్తలు స్థానిక, జిల్లా పరిపాలనను ఆశ్రయించారు. గతేడాది కర్ణాటకలలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.
గత సంవత్సరం గణేశ చతుర్థి ఉత్సవాల్లో వినాయక విగ్రహాలను ఈద్గా మైదానంలో ఉంచడానికి హైకోర్టు అనుమతించింది. హుబ్బళ్లిలోని భూమి వివాదంలో లేదని హైకోర్టు పేర్కొంది. ఉత్సవాలను ఈద్గా మైదానంలో నిర్వహించడానికి అనుమతిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి కోరగా.. ఇంతవరకు మంజూరు కాలేదు. ఇదిలా ఉండగా గత ఏడాది మాదిరిగానే వేడుకలకు అనుమతి ఇవ్వాలని హిందూ అనుకూల సంస్థలు నిరసనలు వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భజనలు పాడుతూ ధర్నాలు చేశారు.
Read Also: Infosys: టైమ్ వరల్డ్ బెస్ట్ 100 కంపెనీల్లో భారత్ నుంచి ఒక్క ఇన్ఫోసిస్‌కి మాత్రమే చోటు..
బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ అనుమతి ఇవ్వకున్నా విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని హెచ్చరించారు. హబ్బళ్లి-ధార్వాడ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన స్థానిక మున్సిపల్ కమిషనర్ పై ఒత్తడి తీసుకురావడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. తమ మనోభావాలను అర్థం చేసుకోవాలని, మేము రాత్రిపూట కూడా నిరసన కొనసాగిస్తామని, అనుమతి ఇచ్చేవరకు మా ఆందోళన కొనసాగుతుందని ఆయన అన్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఈ సారి జిల్లా యంత్రాంగం ద్వారా రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇవ్వకుడా వేడుకలను అడ్డుకుంటోందని, పండగ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరతున్నానని ఎక్స్(ట్విట్టర్)లో కోరారు. దీనిపై రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. అనుమతి ఎవరివ్వమని చెప్పారు, వారు ఎలాంటి లిఖిత పూర్వక అనుమతి కోరలేదని, ఏదైనా ఉంటే చూపించాలని అన్నారు.