Leading News Portal in Telugu

LIC Super Plan : ఎల్ఐసీ సూపర్ పాలసీ.. రోజుకు రూ. 171 కడితే, రూ. 28 లక్షలు మీ సొంతం..


ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తమ వినియోగదారులకు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. వినియోగదారుల నుంచి వస్తున్న స్పందనకు అనుగుణంగానే బీమా సంస్థ కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తోంది. బహుళ ప్రయోజనాలను అందించే ప్లాన్లను పరిచయం చేస్తోంది. మనీ బ్యాక్, లైఫ్, యాన్యుటీ వంటి పలు రకాల ప్లాన్లను ఆవిష్కరిస్తోంది. ఎల్ఐసీ ప్రతి వర్గానికి వారి అవసరానికి అనుగుణంగా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అందులో పిల్లల నుంచి వృద్ధుల వరకూ వారి వారి అవసరాలకు అనుగుణంగా ప్లాన్లు ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లల ఉజ్వల భవిష్యత్తు ప్లాన్ చేసుకుంటున్న పేరెంట్స్ కోసం బెస్ట్ ప్లాన్ ను మీకు పరిచయం చేయబోతుంది..

ఆ పాలసీనే ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్.. దీంట్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్న వారికి మనీ బ్యాక్ ఆప్షన్ కూడా ఉంది.. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు.. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందులో కొందరు మాత్రమే సరియైన మార్గంలో వారి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పొదుపు చేస్తారు. అలాంటి పొదుపు ప్లస్ బీమా కవరేజీ అందించే ప్లాన్ ఎల్ఐసీ జీవన్ తరుణ్. ఇది నాన్ లింక్డ్, మనీ బ్యాక్ ప్లాన్ అంటేమీరు పెట్టే పెట్టుబడి తిరిగి మీ చేతికి వస్తుంది. ఇది మీ పిల్లలకు భవిష్యత్తులో ఉన్నత చదువులు, పెళ్లిళ్ల సమయంలో బాగా ఉపయోగపడుతుంది.. ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను పొందవచ్చు..

మీ పిల్లల పేరు మీద తీసుకొనే పాలసీ కాబట్టి వారి వయసు కనీసం 90 రోజుల నుంచి 12 ఏళ్ల లోపు ఉండాలి. ఇందులో ఏడాదికి కనీసం రూ. 75 మొత్తంతో పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు.. ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతగా డబ్బులు వస్తాయి.. ఉదాహరణకు మీ పిల్లలకు ఏడాది వచ్చేలోపే ఈ ప్లాన్ తీసుకుంటే అప్పుడు మీ మెచ్యూరిటీ టైం 24 ఏళ్లు ఉంటుంది. అప్పుడు మీరు ప్రీమియం 19 ఏళ్ల పాటు చెల్లిస్తే సరిపోతోంది. రూ. 10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే మీ నెలవారీ ప్రీమియం జీఎస్టీతో కలిసి రూ. 3,832 అవుతుంది. అంటే రోజుకీ రూ. 130చెల్లించాల్సి ఉంటుంది..

మీ చిన్నారి వయసు రెండేళ్లప్పుడు మీరు పాలసీ తీసుకుంటే.. అప్పుడు మెచ్యూరిటీ 23 ఏళ్లకు అవుతుంది. అంటే మీరు 18 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీకు రోజుకు పడే ప్రీమియం రూ. 171. దీంతో మీరు చెల్లించే మొత్తం రూ. 10,89,196 అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత అంటే మీ బాబు వయసు 25 ఏళ్లు వచ్చేసరికి ఆ మొత్తం రూ. 28.24లక్షలు అవుతుంది.. మీ పిల్లల కోసం పెద్ద మొత్తం డబ్బులను ఇలా సేవ్ చెయ్యొచ్చు… ఇక ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఈ పథకంలో డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యండి..