Mexico: మానవునికి అందుబాటులో ఉన్నదానికంటే అందని దాని మీదనే ఎక్కువ మక్కువ. తెలియని రహస్యాలని చేదించాలనే ఆసక్తి మనిషిని అంతరిక్షం వైపు అడుగులు వేయించింది. ఆ నిశిలో ఏ నిగూడ రహస్యం దాగిందో అని భూమి మీద ఉన్న మనిషి వెతుకులాట. ఆ వెతుకులాటలో ఎన్నో కొత్త విషయాలను వెలికి తీశారు. వెలుగు చూసిన రహస్యాలు ఇసుక రేణువంత అయితే బయటపడని రహస్యాలు ఖగోళమంత.
భూమి మీద ఉన్న చాల దేశాలు అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం భూమి మీద ఉన్నట్టే అంతరిక్షంలోను మనలానే జీవం ఉందా? ఉంటె వాళ్ళు ఎలా ఉంటారు? మనకంటే అభివృద్ధిలో ముందుటారా? అని సందేహం. ఏలియన్స్ ఉన్నాయని కొందరు బలంగా విశ్వసిస్తారు కూడా. తాజాగా ఏలియన్స్ గురించి మరో వార్త వెలుగు చూసింది.
వివరాలలోకి వెళ్తే: 2017 వ సంవత్సరంలో పెరూ లోని నజ్కా ఎడారిలో తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాల్లో వింత ఆకారం ఉన్న రేడు శకలాలు బయట పడ్డాయి. అవి చూడడానికి అచ్చం ఏలియన్ భౌతికకాయంలా ఉన్నాయని అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఈ విషయాల్ని రహస్యంగా ఉంచిన పరిశోధకులు ప్రస్తుతం తవ్వకాలలో బయటపడ్డ వింత ఆకారాలను మెక్సికో కాంగ్రెస్ సభ్యులకు తెలియజేసేందుకు పార్లమెంట్ కి తీసువెళ్లారు.
మెక్సికో పరిశోధకులు మేము ఇవి గ్రహాంతర వాసుల భౌతికకాయలని భావిస్తున్నామని.. కానీ ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని చెప్పారు. ఈ సంఘటన పైన స్పందించిన నాసా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఆ వింత ఆకారాలు దేనికి సంబంధించినవి అనేదాని మీద స్పష్టత లేదని.. ఇలాంటి విషయాలలో లోతైన పరిశీలన ముఖ్యం అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలానే ఏదైనా వింతగా అనిపిస్తే దాని పైన పరిశోధకులు పరిశోధనలు చేస్తూ ముందుకు వెళ్లాలని సూచించింది నాసా.