Leading News Portal in Telugu

ODI World Cup2023: నేడే వన్డే వరల్డ్ కప్ ఫైనల్, సెమీ ఫైనల్ టిక్కెట్ల విక్రయం


వచ్చే నెల ( అక్టోబర్ ) 5వ తారీఖు నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా పలు కీలక మ్యాచ్‌లకు ఇది వరకే టికెట్ల అమ్మకం పూర్తైంది. తాజాగా ఐసీసీ, బీసీసీఐ‌లు సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లకూ టికెట్లను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. నేటి రాత్రి నుంచి వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు టికెట్ల బుకింగ్ ఓపెన్ కానుంది. ఈ టికెట్లను బుక్ చేసుకోవడానికి గాను క్రికెట్ ఫ్యాన్స్ ఐసీసీ అధికారిక వెబ్‌సైట్ https://tickets.cricketworldcup.com లో బుక్ చేసుకోవచ్చు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి టికెట్ల అమ్మకం స్టార్ట్ అవుతుంది. ఈ మేరకు ఐసీసీ కూడా ఓ ప్రకటన వెల్లడించింది.

విడుదల చేసిన మ్యాచ్ టికెట్లు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
ఇక, బుధవారం, 15 నవంబర్- సెమీ-ఫైనల్-1 ముంబైలోని వాంఖడే స్టేడియం..
గురువారం, 16 నవంబర్- సెమీ-ఫైనల్-2, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్..
నవంబర్-19 ఆదివారం- ఫైనల్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనున్నాయి.

పైన ఉన్న మూడు మ్యాచ్‌లకు టికెట్ బుకింగ్ ఇలా చేసుకోవచ్చు..
స్టెప్-1: తొలుత బుక్‌మైషో వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి..
స్టెప్-2: సెర్చ్ మ్యాచ్స్ బై వెన్యూ (Search matches by venue) అనే ఆప్షన్‌ లోకి వెళ్లి అక్కడ వన్డే ప్రపంచ కప్‌లో మీరు ఏ మ్యాచ్‌కు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఎంచుకోవాలి.
స్టెప్-3: అక్కడ సీట్లను ఎంపిక చేసుకున్న తర్వాత ‘బుక్’అనే ఆప్షన్ కనబడుతుంది.
స్టెప్-4: టికెట్లను డెలివరీ చేసుకోవడానికి పిన్ కోడ్ ఎంటర్ చేయాలి.
స్టెప్-5: ఆ తర్వాత మీ వ్యక్తిగత సమాచారాన్ని పోర్టల్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్-6: – ఇక చివరిగా పేమెంట్ ఆప్షన్‌కు వెళ్లి.. ప్రొసిడ్ టూ పే (Proceed to Pay) పై క్లిక్ చేసి మీ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు.