ఐసీసీ వన్డే క్రికెట్ వరల్ద్ కప్ 2023 అఫీషియల్ పార్ట్నర్ నిస్సాన్ తాజాగా స్పెషల్ ఎడిషన్ కారు లోగోను విడుదల చేసింది. నిస్సాన్ కంపెనీ అత్యంత డిమాండ్ ఉన్న మాగ్నెట్ కారు స్పెషల్ ఎడిషన్ గ్లిఫ్స్ ను మనం చూడొచ్చు. నిస్సార్ మోటార్ ఇండియా ఈ ప్రత్యేక ఫీచర్స్ కలిగిన కారు బుకింగ్ లను కూడా స్టార్ట్ చేసింది. జపనీస్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన కూరో అనే పేరు ప్రత్యేక ఎడిషన్ ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.
నిస్సాన్ మాగ్నైట్ కూరో ప్రత్యేక ఎడిషన్ కారు జోష్ కనిపిస్తుంది. ఈ కార్ ను వచ్చే నెలలో అధికారికంగా నిస్సాన్ ప్రారంభించబోతుంది. ఈ సందర్భంగా దాని ధరను కూడా వెల్లడించనున్నారు. అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. అలాగే మాగ్నెట్ XV MT, మాగ్నెట్ టర్బో XV MT అండ్ మాగ్నెట్ టర్బో XV CVTతో సహా అన్ని టాప్-ఎండ్ కార్లను రూ.11,000 చెల్లించి ఫ్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నిస్సాన్ మాగ్నైట్ కూరో స్పెషల్ ఎడిషన్ ఆకర్షణీయమైన ఆల్-బ్లాక్ ఎక్స్‌టీరియర్ అండ్ ఇంటీరియర్‌తో రాబోతుంది. ఇది.. కస్టమర్ కు ఫేవరెట్‌గా మారనుంది. ఈ కార్ ప్రీమియం లుక్‌తో స్టైలిష్‌గా కనిపిస్తుంది.
బోల్డ్ డిజైన్‌తో కారు వెలుపలి భాగం బ్లాక్ గ్రిల్, స్కిడ్ ప్లేట్, రూఫ్ రెయిల్‌లు, బ్లాక్ అల్లాయ్‌లు, బ్లాక్ ఫినిషర్‌తో కూడిన హెడ్‌ల్యాంప్‌లతో పాటు స్పెషల్ బ్యాడ్జ్‌తో బ్యూటీగా ఈ కారు పాలిష్ చేయబడింది. అంతేకాకుండా మాగ్నెట్ కూరో స్పెషల్ ఎడిషన్ ప్రీమియం గ్లాస్ బ్లాక్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, బ్లాక్ ఇంటీరియర్ యాక్సెంట్‌లు, బ్లాక్ డోర్ ట్రిమ్ ఇన్‌సర్ట్‌లతో కూడి ఉన్నది. ఈ ఫీచర్లు అద్భుతమైన డిజైన్ ఎలిమెంట్‌లను మరింత మెరుగుపరుస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో 360 డిగ్రీ ఎరౌండ్ వ్యూ మానిటర్, విశాలమైన IRVM, ఫ్లోర్ మ్యాట్‌లతో కూడిన సెంటర్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్ అండ్ అలాగే మరింత సౌలభ్యం, స్టైల్ కోసం వైర్‌లెస్ ఛార్జర్ లాంటి ఎన్నో ఉన్నత స్థాయి ఫీచర్లున్నాయి. నిస్సాన్ మాగ్నైట్ గ్లోబల్ NCAP నుంచి అడల్ట్ ఆక్యుపెంట్ సేఫ్టీ రేటింగ్‌లో 4 స్టార్‌లను అందుకుంది. అద్భుతమైన సేఫ్టీ ప్రమాణాలను నిస్సాన్ అందిస్తోంది. నిస్సాన్ ఎక్స్ట్రా సేఫ్టీ ఫీచర్లను పరిచయం చేయడం ద్వారా మాగ్నైట్‌ను అప్‌గ్రేడ్ చేస్తుంది.