Success Story: చాలా మంది భారతీయ యువత తమ చదువు పూర్తయిన తర్వాత విదేశాల్లో ఉద్యోగం సంపాదించి తద్వారా.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. అయితే ఈరోజు మనం విదేశాల్లో మంచి ఉద్యోగం వదిలేసి ఇప్పుడు గ్రామానికి వచ్చి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న ఓ యువకుడి గురించి తెలుసుకుందాం. యువ రైతు ఈ పండు సాగుతో మంచి లాభాలు వస్తున్నాయి. ఈ యువ రైతు పేరు మణిందర్ సింగ్ సందర్. అతను పంజాబ్‌లోని హోషియార్పూర్ నివాసి. అంతకుముందు అతను న్యూజిలాండ్‌లో పనిచేసేవాడు. కానీ భారతదేశం అతనిని తిరిగి తీసుకువచ్చింది. ఇప్పుడు మణిందర్ సింగ్ సందర్ గ్రామానికి వచ్చి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాడు. సాగులో కూడా విజయం సాధించాడు. అయితే, డ్రాగన్ ఫ్రూట్ సాధారణంగా పంజాబ్‌లో సాగు చేయబడదు. మణిందర్ దాని సాగు ప్రారంభించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ అతను పట్టు వదలకుండా కష్టపడి పని చేస్తూనే ఉన్నాడు.
విశేషమేమిటంటే.. యూట్యూబ్ నుంచి చూసి మణిందర్ సింగ్ డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాడు. గత మూడేళ్లుగా తన పితృభూమిలో డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. గతంలో తాను న్యూజిలాండ్‌లో పనిచేసేవాడినని మణీందర్ సింగ్ తెలిపాడు. అక్కడ ప్యాకేజీ కూడా బాగుంది. అయితే, అతను భిన్నంగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఓ రోజు సోషల్ మీడియాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి సమాచారం వచ్చింది. దీని తర్వాత నిపుణులతో మాట్లాడి పంజాబ్‌లో సాగు చేయవచ్చని తేలింది. దీని తర్వాత మణిందర్ సింగ్ ఉద్యోగం వదిలేసి తిరిగి వచ్చి సాగు చేయడం ప్రారంభించాడు. డ్రాగన్ ఫ్రూట్ ఫిబ్రవరి – మార్చి మధ్య విత్తుతారు. ఒక సంవత్సరం తర్వాత ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అయితే, విత్తిన రెండవ సంవత్సరం తర్వాత మాత్రమే తినదగిన పండ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఒక ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్ సాగుతో లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు మణిందర్ సింగ్ తెలిపారు. డెంగ్యూ వ్యాధిగ్రస్తులకు డ్రాగన్ ఫ్రూట్ మేలు చేస్తుందన్నారు.