Leading News Portal in Telugu

Gotmar Fair: రాళ్లతో కొట్టుకోవడం అక్కడ ఆనవాయితీ.. రక్తసంద్రమైన గోట్‌మార్‌


ఏళ్ల నాటి సంప్రదాయం మధ్యప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతుంది. చింద్వారా జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్లడీ గేమ్ గోట్‌మార్‌ను మరోసారి ఆడారు. గత వందేళ్లుగా ఛింద్వారాలోని పాంధుర్నాలో పోలా పండుగ రెండో రోజున గోట్‌మార్ ఫెయిర్‌ నిర్వహిస్తారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. అక్కడి జనాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటారు. అయితే అక్కడి ప్రభుత్వం ఆ సంప్రదాయానికి మూగ ప్రేక్షకుడిగా మారడం తప్ప ఏమీ చేయలేదు.

అక్కడి జనాలు ఈ బ్లడీ గేమ్ ఆడకూడదని ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రయత్నిస్తుంది. కానీ సంప్రదాయం పేరుతో ఈ నెత్తుటి మృత్యు ఆట కొనసాగుతోంది. ఇందులో ఏటా వందలాది మంది గాయపడుతుండడంతో పాటు గత కొన్నేళ్లుగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా జరిగిన తర్వాత కూడా ప్రజల్లో సంప్రదాయ పట్టింపులు పోవడం లేదు. మానవ హక్కుల కమిషన్ కూడా ఈ గేమ్‌ను మూసివేయాలని సిఫారసు చేసింది. కానీ సంప్రదాయం పేరుతో ఇది నేటికీ కొనసాగుతోంది.

Off The Record: టీడీపీ-జనసేన పొత్తు.. బీజేపీకి మైండ్‌ బ్లాంక్‌ అయిందా..?

విషయానికొస్తే.. పోలా పండుగ రెండవ రోజున పంధుర్నా, ఛింద్వారాలోని జామ్ నదిపై ఒక జాతర నిర్వహించుతారు. దీనినే గోత్మార్ అని పిలుస్తారు. ఈ జాతర సందర్భంగా.. జాతర దేవత అయిన చండికా దేవిని పూజించిన తరువాత జామ్ నది మధ్యలో పలాస చెట్టు, జెండాను నాటుతారు. అప్పుడు ఒక వైపు నుండి పాంధుర్నా ప్రజలు, మరొక వైపు నుండి సావర్గావ్ ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటారు. చివరికి జెండాను అందుకోవడంలో ఎవరు సక్సెస్ అవుతారో.. వారే విజేతగా ప్రకటిస్తారు.

ప్రతిసారి లాగానే ఈ ఏడాది కూడా చండికా అమ్మవారికి పూజలు చేసిన అనంతరం నది మధ్యలో పలాస చెట్టు, జెండాను నాటడం ద్వారా ఇరు గ్రామాల ప్రజలు జాతరను ప్రారంభించారు. దీని తర్వాత ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకునే నెత్తుటి ఆట ప్రారంభమైంది. ఎవరి చేతిలో రాయి దొరికిందో వారు ప్రత్యర్థిపైకి విసురుతారు. ఈ యుద్ధంలో ప్రజలు నిరంతరం గాయపడుతారు. వీరి చికిత్స కోసం సివిల్‌ ఆసుపత్రితో పాటు జిల్లా యంత్రాంగం 4 తాత్కాలిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందిస్తారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గాయపడిన వారి సంఖ్య 154కి చేరుకుంది. అయితే స్థానిక పౌరుల ప్రకారం ఈ సంఖ్య 250 దాటింది. ఇందులో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.

Rashmika Mandanna: ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కోసం రష్మిక ఘాటు పోజులు

ఈ జాతరలో భద్రత, పటిష్ట బందోబస్తు కోసం.. కలెక్టర్, ఎస్పీ, 6 ఎస్‌డీఓపీ, 15 టీఐ, 30 ఎస్‌ఐ, 25 ఏఎస్‌ఐలతో కలిపి దాదాపు 500 మంది బలగాలను మోహరించారు. శుక్రవారం మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రారంభమైన ఈ జాతర సాయంత్రం 6:45 గంటలకు పాంధుర్నా, సావర్గావ్ ప్రజల మధ్య పరస్పర ఒప్పందంతో నెత్తుటి ఆట ముగిసింది.