టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. టీమిండియా జట్టు కెప్టెన్ గా దాదాపు ఐదేళ్ల పాటు సేవలు అందించాడు. ఇక ప్రస్తుతం జట్టులో స్టార్ ప్లేయర్ గా ఉన్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు కూడా జట్టు విజయం కోసం తెగ కష్టపడుతున్నాుడు. అయితే.. తాజాగా విరాట్ కోహ్లీ వాటర్ బాయ్ అవతారం ఎత్తాడు. ఇవాళ ( శుక్రవారం ) భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు.
విరాట్ కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బూమ్ర, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లకు జట్టు యాజమాన్యం రెస్ట్ ఇచ్చింది. దీంతో టీమ్ లోకి సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, ప్రసిద్ధ కృష్ణ, షమీ కొత్తగా వచ్చారు. ఈ క్రమంలో టీమిండియా ఫీల్డర్లకు విరాట్ కోహ్లీ వాటర్ బాటిల్స్ తీసుకువెళ్తు కనిపించాడు. అయితే.. గ్రౌండ్ లోకి నార్మల్ గా వెళ్లకుండా.. వెరైటీగా పరుగులు పెడుతూ కోహ్లీ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇక, వాటర్ బాయ్ గా అవతారంలో విరాట్ కోహ్లీ కనిపించడంతో.. అతని ఫ్యాన్స్ వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ మ్యాచ్ ఆడకపోయినా.. టీమ్ కోసం పని చేస్తాడని వ్యాఖ్యనిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఆసియా కప్ 2023 టోర్నీలో ఇప్పటికే భరత జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. సూపర్-4లో భాగంగా పాకిస్తాన్- శ్రీలంక జట్లపై వరుస విజయాలను టీమిండియా సాధించింది. ఈ క్రమంలో ఆదివారం ( సెప్టెంబర్ 17న ) జరిగే ఫైనల్ పోరుకు కూడా రెడీ అయింది. ఆదివారం రోజు శ్రీలంక- టీమిండియా జట్ల మధ్య హోరాహోరిగా మ్యాచ్ జరుగనుంది.
On the field or off the field, can’t get our eyes off this guy 👀#INDvBAN live now only on #DisneyPlusHotstar, free on the mobile app.#FreeMeinDekhteJaao #AsiaCup2023 #AsiaCupOnHotstar #Cricket pic.twitter.com/emqbnrl6Vp
— Disney+ Hotstar (@DisneyPlusHS) September 15, 2023