Leading News Portal in Telugu

IND vs SL: భారత్, శ్రీలంక మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకున్న క్రికెట్ ఫ్యాన్స్‌! వీడియో వైరల్


Fans Fights in India vs Sri Lanka Asia Cup 2023 Clash: ఆసియా క‌ప్‌ 2023 సూప‌ర్-4 స్టేజ్‌లో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భారత్ 41 పరుగుల తేడాతో గెలిచిన విష‌యం తెలిసిందే. మంగళవారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్రికెట్ ఫ్యాన్స్‌ గొడవ పడ్డారు. మ్యాచ్ ముగిసిన వెంటనే గ్యాల‌రీలో ఉన్న కొంద‌రు ఫ్యాన్స్.. ఒక‌రిపై ఒక‌రు చేయిసుకున్నారు. శ్రీలంక జెర్సీలో ఉన్న ఓ వ్య‌క్తి.. పక్కనే ఉన్న కొందరిపై అటాక్ చేశాడు. ఆ స‌మ‌యంలో పక్కనే ఉన్న ఫాన్స్ గొడవపడకుండా అడ్డుకున్నారు.

అటాక్ చేసింది శ్రీలంక ఫ్యాన్ అయినా.. అవతలి వారు ఎవరో తెలియరాలేదు. శ్రీలంక ఫాన్స్ లేదా భారత్ ఫాన్స్ అని తెలియలేదు. పక్కన ఉన్న వారు ఏమైనా హేళన చేస్తే.. శ్రీలంక ఫ్యాన్ రియాక్ట్ అయి ఉండొచ్చని సమాచారం. ఏదేమైనా ఈ ఘ‌ట‌న‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మ్యాచ్ ఓడిపోయిన అసహనంలో శ్రీలంక ఫ్యాన్ రియాక్ట్ అయ్యాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 213 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ (53) హాఫ్ సెంచరీ చేశాడు. లక్ష్య ఛేదనలో శ్రీలంక‌ 42 ఓవ‌ర్ల‌లో 172 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్స్ పడగొట్టాడు. సూప‌ర్-4లో టీమిండియాకు ఇది రెండో విక్ట‌రీ కాబట్టి నేరుగా ఫైనల్ చేరింది. అంతకుముందు పాక్‌పై 228 ర‌న్స్ తేడాతో గెలిచింది. గురువారం పాకిస్తాన్ జట్టుపై గెలిచిన లంక ఫైనల్ చేరింది.