అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వలసలు.. బడి ఈడు పిల్లలపై ప్రభుత్వ దగ్గర ఉన్న లెక్కలను నాదెండ్ల వివరించారు. ఈ ప్రభుత్వంలో సుమారు 2 లక్షలకు పైగా పిల్లల ఆచూకీ తెలియడం లేదు.. సుమారు 3 లక్షల మంది పిల్లల డ్రాపౌట్స్ ఉన్నాయిని ఆయన తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని 3.17 లక్షల కుటుంబాలు వీడి వెళ్లాయని నాదెండ్ల మనోహార్ తెలిపారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో వలసలు ఎక్కువగా ఉన్నాయి.. సీఎం సొంత జిల్లా కడప నుంచి 21 వేల కుటుంబాలు వలస పోయాయి.. చంద్రబాబు తెలుగు ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్.. ఈ ప్రాంతం కోసం చంద్రబాబు చేసిన కృషిని ఎవ్వరూ మరిచిపోకూడదు.. రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగింది.. పవన్ వస్తానంటే విమానం ఎక్కడానికి కూడా అనుమతి లభించని పరిస్థితి.. ఫ్లైట్ ఆపేయడం ఏంటంటూ ఆశ్చర్యపోయామని ఆయన అన్నారు.
రోడ్ మార్గం ద్వారా కూడా పవన్ కళ్యాణ్ ను విజయవాడకు రానియ్యొద్దని అధికారులు చెప్పారని నాదెండ్ల మనోహార్ అన్నారు. అధికారులు అడ్డుకుంటే నడుచుకుంటూ వెళ్లడానికి.. అరెస్ట్ కావడానికి పవన్ సిద్దమయ్యారు.. నాలుగు గంటల పాటు జాతీయ రహాదారిని స్థంభింప చేశారు.. మహిళలు, యువత పవన్ కు అండగా నిలిచారు.. సీఎం పదవిని దీని కోసమేనా వినియోగించేది?అని ఆయన అడిగారు. ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.. 52 నెలల నుంచి ఏపీ ప్రజలే పడే బాధలు వర్ణనాతీతం.. 151 స్థానాలతో ప్రజలు వైసీపీని గెలిపించారు.. జనసేన కూడా ప్రజా తీర్పును గౌరవించింది అని మనోహార్ అన్నారు.
విలువలతో కూడిన రాజకీయం చేయడానికి జనసేన కట్టుబడి ఉందని నాదేండ్ల మనోహర్ అన్నారు. విభజన సమయంలో కుట్ర పూరితంగా ఉప ఎన్నికలు వచ్చేలా తన వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారు.. ప్రతి నెలకో ఎన్నిక జరిగేలా కుట్ర చేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆనాడు కుట్రలతో జగన్ రాజీనామాలు చేయించారు.. ఓ వైపు విభజన హడావుడి జరుగుతోంటే.. ఉప ఎన్నికలు వచ్చేలా కుట్ర చేశాడు.. కౌలు రైతుల కోసం పార్టీ తరపున సాయం చేసిన ఏకైక పార్టీ జనసేనే.. లక్షల కోట్లు.. వేలాది ఎకరాల భూములు.. దేశ విదేశాల్లో ఆస్తులున్న నేతలెవరు చేయని సాయం పవన్ చేశారు.. జనవాణి కార్యక్రమం తర్వాత తమ సభలకు రోగులను పిలిపించుకుని ఆర్ధిక సాయం అని సీఎం జగన్ చెక్కులిస్తున్నారు అని నాదెండ్ల మండిపడ్డారు.