తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా హైదరాబాద్ కొచ్చారు అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అందరం స్వాగతం పలికాం.. తెలంగాణ ప్రజలు కూడా రేపు సభకు తరలి రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ పతనం మొదలైంది.. ఎన్ని హామీలు ఇచ్చిన ఓటమి తప్పదు.. అప్పుల రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలు విజయభేరి సభకు తరలి రావాలి అని ఎంపీ వెంకట్ రెడ్డి కోరారు. బీజేపీ లేదు, బీఆర్ఎస్ ఓడిపోతుంది.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కు ఏం తెల్సు.. తెలంగాణ ఉద్యమం గురించి.. అస్సలు కేటీఆర్ అప్పుడు ఎక్కడున్నాడు అంటూ ఆయన ప్రశ్నించారు.
నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పడ్తున్నారు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన ఏమైంది.. చింతమడకలో ఇంటికి 10 లక్షలు రూపాయలు ఇస్తావ్.. మరి ఇతర గ్రామాల ప్రజలకు ఎందుకు ఇయ్యవ్ అని ఆయన ప్రశ్నించారు. రేపు ( ఆదివారం ) సభలో చెబుతాం.. మేము ఏం చేసేదో.. చేసేదే చెబుతామన్నారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహులను మంత్రి వర్గంలో పెట్టుకున్నావు.. 90 రోజుల్లో బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి పోతరో చూద్దాం అని వెంకట్ రెడ్డి అన్నారు. ఇంటికి పోతరా.. జైలు కు పోతరా అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఒకటో తారికి జీతం ఇయ్యని సర్కార్ కేసీఆర్ సర్కార్.. రాష్ట్రం కోసం 1200 మంది చనిపోతే ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చావ్.. మేము అధికారంలోకి వచ్చాక అన్ని చేస్తామని ఆయన చెప్పారు.