Leading News Portal in Telugu

IPhone 16 Series Leak : ఐఫోన్ 16 సిరీస్ వచ్చేస్తోంది.. ఐఫోన్ 15 మించిన అప్‌గ్రేడ్స్..!


ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న స్మార్ట్ మొబైల్ ఐఫోన్ 15 సిరీస్.. అదిరిపోయే పీచర్స్ ఉండటంతో ఎక్కువ యువత దీన్ని కోనేందుకు ఇష్టపడుతున్నారు.. ఐఫోన్ 15 రావడంతో 14 మరియు 13 సిరీస్ ల ధరలు భారీగా తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 15 సిరీస్ మార్కెట్ లోకి విడుదలైన కొద్ది రోజులకే 16 సీరిస్ రానుందని వార్త వినిపిస్తుంది.. అంతేకాదు దాని ఫీచర్స్ కూడా ఆన్లైన్ లో లీక్ అయినట్లు తెలుస్తుంది.. అవేంటో ఒకసారి చూద్దాం..

2024 నాన్-ప్రో మోడల్‌లకు అతిపెద్ద పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ కావచ్చు. గణనీయమైన RAM అప్‌గ్రేడ్‌ను కూడా పొందవచ్చు. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 2 బూస్ట్ చేసిన A17 ప్రో చిప్‌సెట్, 8GB RAMని పొందవచ్చని లీక్ సూచిస్తుంది. హాంకాంగ్ ఆధారిత సంస్థలో టెక్ విశ్లేషకుడు జెఫ్ పు నుంచి లీక్ వచ్చింది..ఐఫోన్ 13 6GBకి అప్‌గ్రేడ్ చేసిన తర్వాత ప్రామాణిక మోడల్‌లకు మొదటి RAM పెరుగుదలను సూచిస్తుంది. అదనంగా, బూస్ట్ చేసిన A17 ప్రో, A18 ప్రో చిప్‌సెట్‌లు ఐఫోన్ 16 లైనప్‌లో ఉపయోగించే అవకాశం ఉంది..ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు A18 Proని పొందుతాయని కంపెనీ పేర్కొంది. ఈ చిప్‌సెట్‌ల తయారీ ప్రక్రియ కూడా భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

ఐఫోన్ 16 ఫీచర్స్..

ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ అంచనా ప్రకారం.. మోడల్‌ TSMC N3B అనే ప్రక్రియను ఉపయోగిస్తోంది. ఈ ప్రక్రియ ప్రత్యేకంగా ఆపిల్ తయారీదారు సహకారంతో రూపొందించారు. TSMC ఇతర క్లయింట్‌ల కోసం చిప్‌లను తయారు చేసినప్పుడు N3E ఉపయోగిస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. N3B ప్రక్రియ కన్నా N3E ప్రాసెస్‌కు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి..TSMC 3nm చిప్ తయారీని పూర్తి చేసే వరకు ప్రక్రియను తొలగించడం కష్టమే. ఈ టెక్నాలజీతో ఐఫోన్ 16 లైనప్ మరింత సంక్లిష్టమైన మెషిన్-లెర్నింగ్ టాస్క్‌లను కలిగి ఉంటుందని, హై-క్వాలిటీ యాప్‌లతో పాటు మరింత పర్పార్మెన్స్-డిమాండింగ్ గేమ్‌లను నిర్వహిస్తుందని అంచనా.. ఇప్పుడు యాపిల్ మొత్తం దానిపైనే దృష్టి సారిస్తుంది..