Leading News Portal in Telugu

KS Rama Rao: బాబుకి న్యాయం చెయ్యండి.. మోడీకి లేఖ రాసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్!


Producer KS Ramarao‘s letter to Prime Minister Narendra Modi about Chandrababu: టాలీవుడ్ సీనియర్ సినీ నిర్మాత కె.ఎస్ రామారావు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పై సీమాంధ్రులకు ఎలాంటి అభిప్రాయం ఉందో, అందుకు సహకరించిన మీ పార్టీపైనా అదే అభిప్రాయం ఉంది కానీ 2014 ఎన్నికల్లో మీరు కొన్ని సీట్లు, ఓట్లు సంపాదించగలిగారంటే అందుకు కారణం ఒకే ఒక వ్యక్తి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇది ఎవరూ కాదనలేని సత్యం అని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో మీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని ఓట్లు సంపాదించిందో గుర్తు తెచ్చుకోండని పేర్కొన్న ఆయన ఎన్డీఏ కన్వీనర్ గా ఓ వెలుగు వెలిగి, జాతీయ స్థాయిలో మీ కంటే ముందే గుర్తింపు సంపాదించుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా మీ కంటే సీనియర్ అని అన్నారు. 1996 ప్రాంతంలో దేవెగౌడ కంటే ముందే ప్రధాని పదవి ఆయన దగ్గరకు వచ్చినా, దానిని కాదనుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికే పరిమితమయ్యారుని నేడు అందరూ వేనోళ్ళ కొనియాడుతున్న సాంకేతికాభివృద్ధిని పరిచయం చేశారని అన్నారు. కాంగ్రెస్ తో కలసి, పార్లమెంట్ సాక్షిగా మీ పార్టీ సైతం మద్దతు పలికిన ‘ప్రత్యేక హోదా’ను పక్కకునెట్టి ప్రత్యేక ప్యాకేజీ అంటూ మీరు ప్రతిపాదించగా, రాష్ట్రానికి మేలు జరుగుతుందని దానికి అంగీకరించారని అన్నారు.

Singham Again: సింగం వీరులు మళ్ళీ మొదలెట్టారు!

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది, ఇందుకు మీ పాత్ర లేదంటారా ? మీతో స్నేహహస్తం చాచిన చంద్రబాబును తనకు తాను కూటమి నుండి బయటకు వెళ్ళేలా పథక రచన చేశారుని ఆయన అన్నారు. జాతీయ స్థాయి నాయకుడైన చంద్రబాబు కేవలం తన రాష్ట్ర అభివృద్ధి కోసమే తన ప్రాభవాన్ని సైతం పరిమితం చేసుకొని పాటుపడుతూ ఉంటే, సీమాంధ్రులకు మీరు స్వయంగా ఇచ్చిన మాటను సైతం మరచి, చంద్రబాబును నెట్టేశారని, ఓటమిపాలయినా, చంద్రబాబు నిరంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పాటుపడుతూ వచ్చారని ఆయన అన్నారు. 73 ఏళ్ళ వయసులోనూ ఊరూరా తిరుగుతూ తన పార్టీ కోసం ప్రచారం చేసుకుంటున్న నారా చంద్రబాబు నాయుడును స్కిల్డ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కుంభకోణంలో అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అన్యాయం, అక్రమం అని రామారావు అన్నారు. నిజానికి ఆ కేసులో మొదట చంద్రబాబు పేరే లేదు కానీ తరువాత ఆయనను ఏ-37గా పేర్కొన్నారు, అరెస్ట్ చేశాక ఏకంగా ఏ-1గా చిత్రీకరించారు.

ఆధారాలు లేకున్నా, కోర్టుకు వాటిని చూపించే శక్తి లేకపోయినా, అగ్రిమెంట్ లో చంద్రబాబు చేసిన సంతకాలు సాక్ష్యంగా చూపిస్తూ, ఆయన డబ్బు కొట్టేశారని ప్రచారం సాగిస్తున్నారని ఇది హేయమైన చర్య అయితే, ఇక చంద్రబాబును అరెస్ట్ చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిన తరువాత పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉందని తెలుగువారి ఆగ్రహం కట్టలు తెంచుకుందని అన్నారు. అందుకే జనం స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ నినదిస్తున్నాని పేర్కొన్న ఆయన చంద్రబాబు లాంటి జాతీయ స్థాయి నాయకుడిని, అందునా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే విధానంలో ప్రభుత్వం పాటించాల్సిన విధానాలేవీ అనుసరించలేదని, మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో గవర్నర్ లేదా హైకోర్టు ఛీఫ్ జస్టిస్ అనుమతి ఉండాలన్న నిబందనను ఏ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించలేదని అన్నారు.
ఆయన రాసిన పూర్తి లేఖ మీకోసం
Producer Ks Ramarao‘s Scathing Letter To Prime Minister Narendra Modi
Producer Ks Ramarao‘s Scathing Letter To Prime Minister Narendra Modi1