Godavari Anjireddy: ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు బీజేపీ నేత గోదావరి అంజిరెడ్డి. ఇటీవల చనిపోయిన నిరుపేద ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరి అంజిరెడ్డి రూ.20 లక్షలు అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. 20 లక్షల రూపాయల విలువైన ప్రమాద బీమా చెక్కును బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేతులమీదుగా ఈరోజు బాధిత కుటుంబసభ్యులకు అందించారు.
తమ కుటుంబానికి అండగా నిలిచిన బీజేపీ నేతలకు ఆ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.